Wednesday, December 25, 2024

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాసేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు స్కిల్స్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఇంకా 19 పద్దులపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ్యులకు ఓ వినతి చేశారు. అదేమిటంటే నిన్నటిలా నేడు సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్నారు. విషయంపైనే మాట్లాడాలన్నారు. వ్యవసాయం, కోఆపరేటివ్, నీటిపారుదల, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పంచాయతీ రాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, పశుసంవర్ధకం, పర్యాటకం, క్రీడాశాఖ, అటవీ, దేవాదాయ, మైనార్టీ, చేనేత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పద్దులపై నేడు చర్చ జరుగనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News