Thursday, January 23, 2025

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…12వ తేదీకి వాయిదా!

- Advertisement -
- Advertisement -

 

Assembly

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. వారి సేవలను  స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. అనంతరం సభను 12వ తేదీకి వాయిదా వేశారు. కాగా అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి భట్టి విక్రమార్క, సీతక్క, పోదేం వీరయ్య తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సభను కనీసం 20 రోజులు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News