Monday, January 20, 2025

మూడు రోజులు అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో మూడురోజుల పాటు అసెం బ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై సభ్యులు చర్చించారు. ప్ర భుత్వం తరఫున మంత్రులు హరీశ్ రావు, ప్రశాం త్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీలు పాల్గొన్నా రు. ఈ భేటీలో మూడు రోజుల పాటు సమావేశా లు నిర్వహించాలని బిఎసి నిర్ణయించింది. ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరగా పని దినాలు కాదు, పని గంటలు చూడాలని మంత్రి హరీశ్ రావు వారికి సూచించారు. భా రీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై చర్చించాలని వారు నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ప్రభు త్వం దాదాపు పది బిల్లులను ప్రవేశపెట్టే అవకా శం ఉండగా, శుక్రవారం వరదలు, శనివారం ప లు బిల్లులపై చర్చించనున్నారు. సమావేశంలో పా ల్గొన్న సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని 20 రోజు ల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరారు.

దీనికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి స భ ఎన్ని రోజులు జరిగిందన్నది ముఖ్యం కాదని, ఎంత మంచి చర్చ జరిగిందన్నది ముఖ్యమని బ దులిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రతిపక్ష నేతల మానసిక స్థితి దెబ్బతిందని మంత్రి ఎద్దేవా చేశా రు. అసెంబ్లీలో చర్చ సజావుగా సాగేలా చూడాల ని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి పేరిట చర్చ జరగనివ్వలేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సమా వేశాల్లో చర్చించాల్సిన అంశాలను బిఆర్‌ఎస్, మ జ్లిస్, కాంగ్రెస్ పార్టీలు సభాపతికి అందించాయి. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలు, సంక్షేమ పథకాలపై సభలో చర్చించాలని బిఏసి సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశాల్లో దాదాపు పది బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో గవర్నర్ వెనక్కు పంపిన నాలుగు బిల్లులు, ఆర్టీసి ఉద్యోగులు, టిమ్స్ ఆసుపత్రులు, జీఎస్టీ చట్ట సవరణ, కార్మికశాఖకు సంబంధించిన బాయిలర్స్ చట్ట సవరణ బిల్లులను ఈ సభలో ప్రవేశపెట్టనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News