Friday, January 10, 2025

9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో పలు అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారికంగా ప్రకటన వెలువడినా ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారనేది ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయం ఉంటుంది. ఇప్పటికే జనవరి సంక్రాంతి తరువాత రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

అయితే అందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం కూడా ఇప్పటికే పలు అంశాలతో కూడిన నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అర్హులైన రైతులకే దక్కేట్లు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ బిల్లును సైతం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్తగా తీసుకురానున్న ఆర్వోర్ చట్టంతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వే ద్వారా వచ్చే గణాంకాలను అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News