మన రాష్ట్ర శాసనసభ సోమవారం(డిసెంబర్ 30) ఉదయం 10 గంటలకు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. మాజీ ప్ర ధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనం గా నివాళులర్పించడం కోసం సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. మన్మోహన్ సింగ్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాప తీర్మా నం ప్రవేశపెట్టనున్నారు. ఆచార్యునిగా, ఆర్థికవేత్త గా, యుజిసి చైర్మన్‌గా, ఆర్‌బిఐ గవర్నర్‌గా, ప్ర ణాళికా మండలి ఉపాధ్యక్షునిగా, దేశ ఆర్థిక మం త్రిగా, ప్రధానమంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను సిఎం పేర్కొననున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ సింగ్ అందించిన సహకారంపైనా చ ర్చించి ఆయన మృతికి సంతాపం తెలియజేయనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలను పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంతాపదినాల్లోనే శాసనసభ సమావేశం పెట్టి శ్రద్ధాంజలి ఘటించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే.
ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్, మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్ర మూడవ శాసనసభ, నాలుగవ సెషన్ రెండవ సమావేశాల ఏర్పాట్లను ఆదివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డిజిపి పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశాలు సజావుగా జరిగే విధంగా చూడాలని తెలిపారు.
ప్రభుత్వ అధికారులతో సమన్యయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ నరసింహా చార్యులకు సభాపతి ప్రసాద్ కుమార్ సూచించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎంఎల్‌ఎలకు లేఖల ద్వారా సమాచారం అందజేశారు. శాసనసభ నాలుగో విడతలో రెండో సమావేశంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎల్‌ఎలందరూ హాజరు కావాలని కోరారు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని 16 నియమం కింద గల రెండో నిబంధన అధికారాల మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ సోమవారం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.