Sunday, December 22, 2024

9 నుంచి అసెంబ్లీ?

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఒఆర్ సహా పలు చట్టాలకు
ఆమోదం కులగణనపై సమగ్ర
చర్చ సర్వే ఆధారంగా
రిజర్వేషన్లపై కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికలకు ముందుగానే
ఆసరా పింఛన్లు పెంపు రైతు
భరోసా పథకం అమలుకు కసరత్తు

మన తెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. ఈ సమావేశాల్లో పలు చట్టాల ఆమోదానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించనుంది. దీంతోపాటు కులగణన సర్వేపై కూడా ఈ సమావేశాల్లో చర్చించనుంది. ఈ సర్వే ఆధారంగా బిసి రి జర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే కొండపోచమ్మ సాగర్ దగ్గరలోని మాజీ మంత్రి హరీష్ రావు ఫాంహౌస్ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. డిసెంబర్ 7వ తేదీతో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కానుంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు గా సమాచారం.

అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫ లితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నా, ఆలోపే మంత్రివ ర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి వర్గంలో ప్రాతిని థ్యం లేదు. ఈ జిల్లాకు చెందిన నాయకులను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసిం ది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. జనవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందుగానే ఆసరా పెన్షన్ కిం ద ఇచ్చే మొత్తాన్ని పెంచడంతో పాటు రైతు భరో సా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స న్నాహాలు చేస్తోంది. ఎన్నికలకు ముందు పెన్షన్ పెంచితే ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు పార్టీ కి మైలేజీ వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News