Thursday, January 16, 2025

నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

సభ ఎన్ని రోజులు నిర్వహించేది నేటి బిఎసిలో నిర్ణయం చర్చకు
రానున్న ఆర్‌ఒఆర్, హైడ్రా సహా పలు కీలక బిల్లులు బిఆర్
ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపైనా చర్చ
నేడు సంతాప తీర్మానాలు, తెలుగు విశ్వవిద్యాలయాల సవరణ
బిల్లు పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటల నుంచి పునర్ ః ప్రా రంభం కానున్నాయి. ఈ నెల 9 వ తేదీన ప్రారంభమైన ఉభయ సభలు 16 వ తేదీ వ రకు వాయిదా పడిన విషయం తెలిసిందే. శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్‌ఒఆర్, హై డ్రా వంటి కీలక బిల్లులు పూర్తిస్థాయిలో త యారు కాకపోవడంతో వారం రోజులు స భకు విరామం ఇచ్చినటు అధికార వర్గాల సమాచారం.

సభలో మొదట కొత్త రెవిన్యూ చట్టం (ఆర్‌ఒఆర్ ముసాయిదా బిలు)్ల పై చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. సోమవారం సభ ప్రా రంభం కాగానే మొదట సభాపతి సంతా ప తీర్మానాలను ప్రవేశ పెడుతారు. ఉమ్మడి క రీంనగర్ జిల్లా మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొ మిరెడ్డి జ్యోతి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లం దు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా దొమ్మాట మాజీ ఎమ్మెల్యే డి. రామచంద్రారెడ్డి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సభ ప్రగాఢ సాభుభూతి తెలియజేసే తీర్మానాలు సభాపతి ప్రవేశపెడుతారు.

తెలంగాణ యువ భారత వ్యా యామ విద్య మరియు క్రీడా వర్శిటీ బిల్లు 2024, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు–లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెడుతారు. అనంతరం సభలో ‘తెలంగాణ రాష్ట్రంలో ప ర్యాటక వి ధానం’పై స్వల్పకాలిక చర్చ జరుగుతుంద ని అసెంబ్లీ స్పీకర్ విడుదల చేసిన ఎజెండా లో పేర్కొన్నారు. సభలో ప్రశోన్నత్తరాల వ్య వధిలో, గ్రామ పంచాయతీలో బిటి రోడ్లపై పాలకపక్ష సభ్యులు వంశీకృష్ణ, బాలూ నాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డి,,

మున్సిపాల్టీలలో పారిశుద్ధ కార్మికుల క్రమబద్ధీకరణపై పాలకపక్ష సభ్యులు మందుల సామేల్, గ్రామపంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై ప్రతిపక్ష సభ్యులు టి హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు, ముదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యంపై పాలకపక్షం సభ్యుడు అనిరూధ్‌రెడ్డి, ఇండస్ట్రీయల్ పార్క్‌లపై బీజేపీ సభ్యుడు కె వెంకటరమణారెడ్డి, రాష్ట్రంలో పర్యాటకానికి ప్రోత్సాహాలపై పాలకపక్షం సభ్యుడు బాలూ నాయక్, వంశీకృష్ణ, రామచందర్ నాయక్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఇ విద్యార్థుల డిటెన్షన్‌పై ఎంఐఎం సభ్యులు అక్బరుద్ధీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం చెప్పనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News