Sunday, January 19, 2025

ఈ నెల 20 వరకే అసెంబ్లీ సమావేశాలు?

- Advertisement -
- Advertisement -

శాసనసభా, శాసనమండలి సమావేశాలు ఈ నెల 20 వరకే కొనసాగనున్నట్టు పాలకపక్ష వర్గాల సమాచారం. అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి వరకు నిర్వహించాలనే అంశం బిఏసిలో ఖరారు కాకపోయినప్పటికీ ఈ నెల 20 వరకే కొనసాగుతాయని అధికార వర్గాలకు కూడా సమాచారం ఉన్నట్టు తెలిసింది. క్రిస్‌మస్ పండుగ సందర్భాంగా ఈ నెల 21న ప్రభుత్వం అధికారకంగా వేడుకలు నిర్వహించనుందని, ఆ లోగానే అసెంబ్లీ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఈ వర్గాల సమాచారం. ఈ నెల 20 న అసెంబ్లీ సమావేశాలుముగిసే అవకాశం ఉండటంతో 19న సభలో ఆర్ అండ్ చట్టం పై బిల్లు ప్రవేశ పెట్టు అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సభలో మంగళవారం మూడు బిల్లులను ప్రవేశపెట్టడంతో ఇక మిగిలిన రెండు కీలక బిల్లులు ఆర్ అండ్ ఆర్, గ్రామ పంచాయతీ ఎన్నికల చట్ట సవరణ (పోటి చేసే అభ్యర్థులకు గతంలో పెట్టిన సంతానం నిబంధన తొలగింపు) బుధ, గురువారం సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇలా ఉండగా ఈ సారి శాసన సభ సమావేశాలను ఆరు పని దినాలకే పరిమితం చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 9న సోమవారం ప్రారంభమైన సమావేశాలు ఆ వారం రోజులకు మరుసటి సోమవారానికి (16కు) వాయిదా పడిన విషయం తెలిసిందే. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం ఐదు రోజులు, అంతకు ముందు ఒక రోజు మొత్తంగా ఈ సెషన్‌లో 6 వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటాయని పాలకపక్ష వర్గాల విశ్వసనీయవర్గాల సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News