Thursday, January 23, 2025

ఆప్మేల్‌పై ఆచితూచి

- Advertisement -
- Advertisement -

ఎపి పునర్విభజన చట్టం
2014 ప్రకారం సింగరేణి,
దాని అనుబంధ సంస్థ
ఆప్మేల్ రెండు తెలంగాణవే
ఈ సంస్థలపై అటార్నీ
జనరల్ కోరిన
అభిప్రాయంపై న్యాయ
నిపుణులను
సంప్రదించనున్న సిఎం
కెసిఆర్ 12వ షెడ్యూల్
సంస్థలకు స్థలంతో
సంబంధం లేదు

రేపటి అంశాల చర్చలో ఇదే కీలకం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అనగానే చటుక్కున స్ఫురించే మరో అంశం ఆ ప్మేల్. సింగరేణి అనుబంధ సంస్థే ఐ నా వ్యవస్థీకృతంగా విజయవాడ పరి సరాల్లోని కొండపల్లిలో ఉండడంతో ఆప్మేల్ తమకే చెందుతుందనేది ఎపి వాదన. విభజన అంశాలపై 12న గే సమావేశంలో ఆప్మేల్‌పై కీలక చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ హెవీ మెషి నరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ వివాదా న్ని పరిష్కరించడం కోసం కేంద్రం అటార్నీ జనరల్ ఒపినీయన్ కోరింది. దీంతో ఆయా సంస్థలున్న భూభాగాల ఆధారంగా తెలంగాణకు సింగరేణి, ఆంధ్రాకు ఆస్మేల్ సంస్థలు చెందుతాయని, దీనిపై అభిప్రాయం పంపాలంటూ ఆటార్నీ జనరల్ తెలంగాణను కోరారు. ప్రస్తుతం ఆ ఫైల్ సిఎంఓ సర్కులేషన్లో ఉంది. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నారు. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాధానం పంపనుంది.

విజయవాడ సమీపంలో కొండపల్లిలోని 209 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ సింగరేణి అనుబంధ సంస్థ.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 12వ షెడ్యూల్లోని సంస్థల జాబితాలో సింగరేణిని చేర్చారు. చట్ట ప్రకారం ఆ సంస్థ పూర్తిగా తెలంగాణకే చెందుతుంది. ఈ మేరకు 2014లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరిట ఉన్న 51 శాతం షేర్లు తెలంగాణ పేరిట బదలాయింపు జరిగిపోయింది. మిగిలిన 49 శాతం షేర్లు యధాతధంగా భారత ప్రభుత్వం పేరిట కొనసాగుతున్నాయి. కాగా, సింగరేణి అనుబంధ సంస్థగా ఉన్న ఆప్మేల్‌ను పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9 జాబితాలో చేర్చారు. దీంతో ఆ సంస్థ విభజనకు చిక్కుముడి పడినట్లైంది.

వాస్తవానికి సింగరేణి కాలరీస్‌కు వర్తించే నిబంధనే ఆప్మేల్‌కు కూడా వర్తిస్తుంది. ఆప్మేల్ ఆస్తుల విలువ సుమారు రూ.700 కోట్లు. సంస్థలో 84 శాతం వాటా సింగరేణి యాజమాన్యం ప్లస్ భారత ప్రభుత్వానిది. మిగిలిన దాంట్లో 6 శాతం వాటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ది కాగా, 11 శాతం ఇతర షేర్ హోల్డర్స్‌ది. కేవలం 0.86 శాతం మాత్రమే అప్పటి సమైక్య రాష్ట్ర వాటా. ఇక చట్ట ప్రకారం ఆప్మేల్ సంస్థను లోకేషన్ బేసిస్‌గా చూడటానికి లేదనేది నిపుణుల అభిప్రాయం. పైగా ఆప్మేల్‌లో 84 శాతంగా ఉన్న కంపెనీ షేర్సు కంపెనీస్ యాక్ట్ ప్రకారం పెంచడానికి వీల్లేదు. ఇతర షేర్ హోల్డర్స్, ఐఐసిల వాటా ముట్టడానికి లేదు. ఇక మిగిలిన 0.86 శాతంలోనే విభజన చట్టం ప్రకారం ఎపికి 58.32 శాతం, తెలంగాణకు 41.68 శాతం వాటా పంచాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాన్నంతా తోసిరాజని ఎపి వితండవాదానికి దిగుతోంది. తమ భూభాగంలో ఉన్న ఆప్మేల్ తమదేనంటూ, సింగరేణిలో కూడా తమకు వాటా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ అడ్డంగా వాదిస్తోంది. ఇదే వాదనను కేంద్ర హోం శాఖ ముందు కూడా వినిపించింది. దీనికి స్పందించిన కేంద్రం, ఈ వ్యవహారంపై భారత అటార్నీ జనరల్ ఓపినీయన్ను కోరింది. స్పందనగా ఆయా సంస్థలున్న భూభాగాల ఆధారంగా తెలంగాణకు సింగరేణి కాలరీస్, ఆంధ్రాకు ఆప్మేల్ సంస్థలు చెందుతాయని అటార్నీ జనరల్ ఒక రిపోర్టు ఇచ్చారు. దీనిపై అభిప్రాయం తెలపాలంటూ రెండు నెలల క్రితం తెలంగాణకు కేంద్రం ఒక నివేదిక ప్రతిని పంపింది. ప్రస్తుతం ఆ ఫైల్ సిఎంఓ సర్కులేషన్లో ఉంది. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నారని సమాచారం. ఆ తరువాతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాధానం పంపనుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని షెడ్యూల్ 12 ప్రకారం సింగరేణి సంస్థ తెలంగాణకే చెందుతుంది. దాని అనుబంధ సంస్థగా ఆప్మేల్‌కు కూడా అదే నిబంధన వర్తిస్తుంది. చట్ట ప్రకారం వీటిలో వాటాలకు ఆస్కారమే లేదు. ఉన్నదల్లా 0.86 శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షేర్ చేస్తేగీస్తే ఈ భాగంలో మాత్రమే విభజన చేసి ఆంధ్రాకు 58.32 శాతం పంచాల్సి ఉంటుంది. ఎపి ఎన్ని కొర్రీలు వేసినా బైఫర్కేషన్ యా క్టు ప్రకారం మిగిలిందంతా తెలంగాణకే చెందుతుందని న్యాయనిపుణులు అం టున్నారు. అందుకే ఈ మధ్య సిఎం కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహార శైలిపైన కొంత ఘాటుగానే స్పందించారు. ఇప్పటికే పరిష్కరించబడిన అంశాల ను లేవనెత్తవద్దంటూ హితవు పలికారు. వివాదాస్పద విషయాల పరిష్కారం కోసం తాము చట్టప్రకారం నడుచుకుంటామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News