Monday, December 23, 2024

మార్చి 10న తెలంగాణ బచావో సభ: కోదండరాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మార్చి 10న తెలంగాణ బచావో సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జన సమితి(టిజెఎస్) అధ్యక్షుడు ఎం కోదండరాం బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన కోదండరాం ఈ సభలో తెలంగాణ ఉద్యమలో పాలుపంచుకున్నవారు పాల్గొంటారని చెప్పారు. తెంలగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి నిర్వహించిన మిలియన్ మార్చ్ స్ఫూర్తితోనే మార్చి 10న తెలగాణ బచావో సభను ఏర్పాటు చేస్తున్నట్లు కోదండరాం తెలిపారు. ఈ సభలో వచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా కలసికట్టుగా పోరాడితేనే తెలంగాణ స్వప్నం సాకారమైందని ఆయన చెప్పారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం తేటతెల్లం చేస్తోందని ఆయన ఆరోపించారు. కుంభకోణంలో తమ వాటా కోసం ఒక కుటుంబం ప్రయత్నించినట్లు ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడేందుకు వీలు కల్పించేందుకే ధరిణి పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని కోదండరాం ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఢిల్లీలో పచ్చి ప్రజాస్వామ్యవాదినలా నటిస్తూ తెలంగాణలో నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ వ్యవహారశైలి తెలంగాణ ప్రజలకు శాపంలా మారిందని కోదండరాం విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News