Sunday, January 5, 2025

మీ సేవ సెంటర్లకు తాకిడి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకానికి అనూ హ్య జనాదరణ లభిస్తోంది. వెను కబడిన వర్గాలలోని కులవృత్తులు, చేతి వృత్తుల వారికి ఆర్థిక సహా యం అందించాలని ముఖ్యమం త్రి కెసిఆర్ ఈ బృహత్ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలి సిందే. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 100 శాతం సబ్సిడీతో ఈ పథకాన్ని రూపొందించారు.  దాదాపు మూడున్నర లక్షలకు పైగా ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు సమాచారం. ఆన్‌లైన్ దరఖాస్తులకు సాంకేతిక సమస్యల వల్ల లక్షలాది మంది ఇంకా దరఖాస్తు చేసుకోలేక పోయారని బిసి వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం తరలి రావడం, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుకు వత్తిడి పెరగడంతో సర్వర్ పనిచేయక పోవడం, తరచూ అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. దరఖాస్తుకు 20వ తేదీ ఆఖరు కావడంతో కుల వృత్తిదారులు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన కులవృత్తుల వారందరికీ ఆర్థిక సహాయం అందించాలని బిసి సంఘాలు, కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి తొలిదశలో ఆర్థిక సహాయం అందిస్తూనే దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం నిరంతర ప్రక్రియ అంటూనే చివరి తేదీ నిర్ణయించడమేమిటని బిసి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ పథకాన్ని బిసి జాబితాలోని కులాలన్నింటికి వర్తింపచేయాలని కోరుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తూనే అర్హులకు స్రతినెలా ఆర్థిక సాయం అందజేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గడువును పొడిగించాలని కులసంఘాలు కోరుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News