Monday, December 23, 2024

బెంగళూరులో సిఎం కెసిఆర్‌ను కలిసిన తెలంగాణ బిసి కమిషన్

- Advertisement -
- Advertisement -

Telangana BC Commission meets CM KCR in Bangalore

హైదరాబాద్ : కర్నాటక రాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ గురువారం బెంగళూరులో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసింది. కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు సారధ్యంతో సభ్యులు సిహెచ్. ఉపేంద్ర, కె. కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్‌లు బెంగళూరు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను స్థానిక లీలా ప్యాలెస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ అధ్యయన వివరాలను సిఎం కెసిఆర్ కు వివరించారు. మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి ముఖ్యమైన ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజిక వేత్తలను కలుసుకోనున్నట్లు చైర్మన్ ముఖ్యమంత్రికి వివరించారు. బిసి కమిషన్ కొనసాగిస్తున్న అధ్యయన వివరాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇదే విధంగా ప్రత్యేక స్పూర్తితో అధ్యయనం ముందుకు కొనసాగించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News