Monday, December 23, 2024

మొక్కలు నాటడం అలవర్చుకోండి : శుభ ప్రద్ పటేల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం అలవర్చుకోవడంతో పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావొచ్చునని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. తన పుట్టినరోజు రోజు పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గురువారం వికారాబాద్ జిల్లా తాండూర్ ఎఆర్ గార్డెన్‌లో ఆయన మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. పుట్టినరోజు నాడు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గత మూడేండ్లుగా తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతున్నానని, భవిష్యత్తులో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News