42 శాతం రిజర్వేషన్లు సాధించడమే
లక్షంగా ఆందోళన పాల్గొననున్న
రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌ఎలు
నేడు ఢిల్లీకి వెళ్లనున్న రాష్ట్ర
మంత్రులు సంఘీభావం తెలపనున్న
రాహుల్ గాంధీ సిఎం రేవంత్,
డిప్యూటీ సిఎం భట్టి పాల్గొనే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన వెనుకబడిన తరగతులకు 42 శా తం రిజర్వేషన్ల పెంపుదల కేంద్రంపై ఒత్తిడి పెం చేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఏప్రిల్ రెండో తేదీ బు ధవారం నాడు ఢిల్లీలో జరుగనున్న బిసి సంఘా ల మహాధర్నాకు మంత్రులు సంఘీభావం ప్రకటించనున్నారు. బిసి సంఘాల మహాధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమా ర్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రు లు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకరయ్య తదితరులు పాల్గొ నే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 2,3 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రా హుల్ గాంధీ సహకారంతో వివిధ పార్టీ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోరనున్నారు.