Thursday, January 16, 2025

పదేళ్లలో రూ.84లక్షల కోట్ల ఆర్థిక తెలంగాణ: శ్రీధర్‌బాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రానున్న పదేళ్లలో తెలంగాణాను ట్రిలియన్ డాలర్ల (రూ.84 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కృత్రిమ మేథ, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లు చోదక శక్తులుగా ఈ అసాధారణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ ఏఐ కంపెనీ అయిన ఫినోమ్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో తన మొదటి ఐయామ్‌ఫినోమ్ ఇండియా సదస్సును శుక్రవారం నిర్వహించింది. 500 మంది సీనియర్ హెచ్ ఆర్ నిపుణులు, సిఎక్స్‌ఓలు, సిహెచ్‌ఆర్‌ఓలు, ఆలోచనాపరులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఈ కార్యక్రమం మేధస్సు, ఆటోమేషన్, అనుభవం ద్వారా ప్రతిభావంతులను పొందడం, నిర్వహించడం యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. కృత్రిమ మేథలో దిగ్గజ సంస్థ ‘ఫెనామ్’ హైటెక్ సిటీలో శుక్రవారం నిర్వహించిన ‘ఐయామ్ ఫెనామ్ ఇండియా’ సదస్సు ముగింపు సందర్భంగా శ్రీధర్ బాబు ప్రసంగించారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా భవిష్యత్తు అవసరాలకు సరిపడా నిపుణులైన మానవ వనరులను అందిస్తామని ఆయన తెలిపారు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడం ద్వారా యువతలోని పూర్తి సామర్థ్యాలను వెలికితీయడంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫెనామ్ లాంటి యూనికార్న్ సంస్థలు సహాయ పడాలని ఆయన ఆకాంక్షించారు. పని ఆకృతిని మార్చిన అత్యాధునిక ఏఐ, ఆటోమేషన్‌పై ఈ సదస్సులో చర్చ జరిగింది. డిజిటల్ పరివర్తన యుగం లో వేగంగా నియమించుకోవడానికి, మెరుగ్గా అభివృద్ధి చెందడానికి, ఎక్కువ కాలం ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు ఫెనామ్ ఇంటెలిజెంట్ టాలెంట్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్ ఆయా సంస్థలను ఎలా శక్తివంతం చేస్తుందో విశ్లేషించింది. మంత్రి డి.శ్రీధర్ బాబు భారతదేశ శ్రామికశక్తి ల్యాండ్‌స్కేప్‌ను రూపొందించడంలో ఏఐ, ఆటోమేషన్ కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యమన్నారు. ఈ మార్పు ముఖ్యముగా ఏఐ డ్రైవర్లు, సెమీకండక్టర్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై బలమైన దృష్టిని కలిగి ఉంటాయని చెప్పారు.

ఈ వృద్ధికి మద్దతుగా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ వంటి కార్యక్రమాల ద్వారా తాము టాలెంట్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించామని, వర్క్‌ఫోర్స్ శిక్షణ పొంది భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.భారతదేశ ఆర్థిక ఆశయాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని రూపొందించడంలో ఏఐ ఆధారిత వినూత్నత ప్రధానమైనదన్నారు. హైదరాబాద్‌కు చెందిన యునికార్న్ అయిన ఫెనామ్ వంటి సంస్థలు మరింత అనుసంధానించబడిన కార్యాలయాలను నిర్మించడానికి సంస్థలకు సాధికారత కల్పించడంలో ఫినోమ్ వంటి సంస్థలు కీలకమైనవన్నారు.

వృద్ధిని పెంచేవిగా ఏఐ, ఆటోమేషన్
ఫినోమ్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు మహే బాయిరెడ్డి మాట్లాడుతూ ఒక బిలియన్ మందికి సరైన పనిని కనుగొనడంలో సహాయపడే ఫినోమ్ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఆర్‌ని మారుస్తుందని, భారతదేశం అంతర్జాతీయ శ్రామికశక్తి వినూత్నతలో ఒక పవర్ హౌస్ అన్నారు. ఐయామ్ ఫినోమ్ ఇండియాతో తాము ఏఐ సామర్థ్యాన్ని మాత్రమే ప్రదర్శించడం లేదని,- ఉత్పాదకతను వెలికి తీయడానికి, అర్ధవంతమైన వ్యాపార ఫలితాలను అందించడానికి హెచ్‌ఆర్ నాయకుల కోసం పరివర్తనాత్మక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నామన్నారు. పని భవిష్యత్తు ఇక్కడ, మేధస్సు, ఆటోమేషన్, అనుభవంతో ఆధా రితమని ఆయన అన్నారు.

థాట్ లీడర్‌షిప్, ఇన్నోవేషన్, ఏఐ, టాలెంట్ మేనేజ్‌మెంట్ కలయికను చాటిచెబుతూ ఫినోమ్ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్, సీఓఓ హరి బాయిరెడ్డి మాట్లాడుతూ అసాధారణమైన ప్రతిభ అనుభవాలు కేవలం పోటీ ప్రయోజనం కాదని, ఆధునిక వ్యాపారంలో మనుగడ కోసం అవి చాలా అవసరమన్నారు. వినూత్నతలను పెంపొందించడానికి ఫెనామ్ భారతీయ సంస్థలతో భాగస్వామి కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపియన్ అభినవ్ బింధ్రా, ఫెనామ్ అధ్యక్షుడు, సహ వ్యవస్థాపకుడు హరి బైరెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయి కృష్ణ, ఐటీ స్ట్రాటెజిస్ట్ శ్రీకాంత్ లంకా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News