Saturday, December 21, 2024

‘TG’ గా మొదటి రిజిస్ట్రేషన్.. ఫ్యాన్సీ నంబర్ కోసం లక్షలు పెట్టాడు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వాహనాలకు TGతో నిన్న రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. అయితే తొలి రోజు వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడ్డారు. ఖైరాతాబాద్ లో నిర్వహంచిన బిడ్డింగ్ లో TG 09 0001 నంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్ అనే వాహనదారుడు అక్షరాల రూ. 9.61 లక్షలు చెల్లించుకున్నాడు. ఒక్క ఖైరాతాబాద్ లోనే ఒక్క రోజులో రూ. 30.49 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. TG 09 0909 అనే నంబర్ కు మరో వాహనదారుడు రూ.2.30 లక్షలు వెచ్చించాడు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్లకు ఎపి, బదులుగా టిఎస్ ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ టిఎస్ ను మార్చి బండ్ల రిజిస్ట్రేషన్లకు టిజితో రిజిస్ట్రేషన్లు చేస్తోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News