Sunday, December 29, 2024

అగ్రిటెక్‌లో తెలంగాణ ఆదర్శం

- Advertisement -
- Advertisement -

డిజిటల్ వ్యవసాయాన్ని పెంపొందించేందుకు డబ్లుఇఎఫ్ భాగస్వామ్యంతో పిపిపి విధానాన్ని అమలుచేస్తున్న రాష్ట్రం 
దేశంలో ఈ తరహా వ్యవసాయం చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణే 
నాలుగు మూలస్తంభాలతో సమూల మార్పు
వ్యవసాయ రంగంలో సాంకేతిక సేవల పెంపునకు ప్రభుత్వాల ప్రధాన పాత్ర అవసరాన్ని ఎత్తిచూపుతున్న
తెలంగాణ అనుభవం

హైదరాబాద్: ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస.్థ దాదాపు 85 శాతం మంది రైతులు చిన్న కమతాలు కలిగి ఉన్న వాళ్లే. అయినప్పటికీ దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 51 శాతం వీరు పండించిందే కావడం గమనార్హం. అయితే ఇప్పటికీ రైతులు చాలా వరకు సంప్రదాయ పద్ధతుల్లోనే సేద్యం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అడుగు పెడుతోంది. దేశంలో 1,000కు పైగా అగ్రిటెక్ స్టార్టప్‌లు (అంకుర సంస్థలు) ఉన్నాయి.

ఈ అగ్రిటెక్ సంస్థలు అందించే డేటా ఆధారిత సేవల వల్ల ్ల2025 నాటికి వ్యవసాయ రంగంలో ఆదాయం అదనంగా 50 70 బిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని నిపుణుల అంచనా. పలు ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాల మాదిరిగానే అగ్రిటెక్ రంగానికి కూడా తన పరిష్కారాల సామర్థాన్ని పెంచుకోవడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇంక్యుబరేటర్లు, స్టార్టప్‌లకు మౌలిక పెటుబడిని అందించడం, ప్రభుత్వ మద్దతుతో కూడిన వెంచర్ క్యాపిటల్, టాక్స్ హాలిడేలు, రాయితీలులాంటి పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇలా ప్రభుత్వాలు ఎంతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ వ్యవసాయ రంగం తన భారీ మార్కెట్ పూర్తి సామర్థాన్ని ఇప్పటికీ సాధించలేదు.

దానికి ప్రధాన కారణం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లే. చిన్న కమతాల వ్యవసాయం, దాదాపు అవ్యవస్థీకృత రంగంగా ఉండడం లాంటి వాటి వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిపట్ల వారిలో అవగాహన కల్పించడం, సేవలు అందించడంతో పాటుగా రైతు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడం చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటోంది. అందువల్ల రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే అగ్రిటెక్ సేవలను అందించే వ్యవస్థ చవకగా ఉండేలా చూసే ఒక వాతావరణాన్ని సృషిచేవిగా ప్రభుత్వ విధానాలు ఉండాలిసన అవసరం ఉంది.
2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడన తెలంగాణ దేశంలోనే అత్యంత పిన్న వయసు రాష్ట్రం. 2021 22ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల విలువ(జిడిపి)లో వ్యవసాయ రంగం వాటా 18.3 శాతంగా ఉంది. వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతమైనదిగా, నిలకడదైనదిగా చేయడం ద్వారా రైతుల ఆదాయాలను పెంచి గ్రామీణాభివృద్ధిని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఇదిఒక ప్రధాన రంగంగా ఉంటోంది.

ఈ రంగంలో వ్యవసాయ సాంకేతికతను పెంచడంతో పాటుగా ప్రధాన అంశంగా చేయడం ప్రభుత్వ వ్యూహంలో ప్రధాన భాగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రపంచ ఆర్థిక వేదిక( డబ్లు ఇఎఫ్) భాగస్వామ్యంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య(పిపిపి )విధానాన్ని అమలు చేస్తోంది. దేశంలో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఇదే కావడం విశేషం. డబ్లుఇఎఫ్‌కు దేశంలో వ్యవసాయం, ఆహార వ్యవస్థలపై ప్రధానంగా దృష్టిపెట్టిన రెండు కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో మొదటిది వ్యవసాయ ఆవిష్కరణల కోసం కృత్రిమ మేధ(ఎఐ4 ఎఐ) కాగా వ్యవసాయ సాంకేతికతను, ఆవిష్కరణలను ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని మార్చి వేసే లక్షంతో ఫుడ్ ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేయడం రెండోది.
ఈ పిపిపి విధానంలో నాలుగు మూలస్తంభాలున్నాయి. అవి అగ్రివాల్యూ చైన్ ట్రాన్స్‌ఫర్మేషన్, అగ్రిటెక్ శాండ్‌బాక్స్, అగ్రికల్చర్ డేటా ఎక్స్‌చేంజ్, అగ్రికల్చర్ డేటా మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్. వ్యవసాయ సాంకేతికతలను మరింత ఎక్కువగా ఉపయోగించుకునే వాతావరణాన్ని అభివృద్ధి చేయడం తొలి రెండింటి ప్రధాన ఉద్దేశం కాగా రైతుల కోసం వారికే ఉపయోగపడే సేవలను వేగంగా అభివృద్ధి చేయడంతో పాటుగా అత్యాధునిక డేటాను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాలు, విధానాలను రూపొందించడంపై మిగతా రెండు అంగాలు దృష్టిపెడతాయి.

పాలనా పరమైన, విధానపరమైన మద్దతు, డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాల ద్వారా చిట్ట చివరి వినియోగదారుడైన రైతుకు సాగు సాంకేతికతలను సులువుగా అందించడంద్వారా వ్యవసాయ విలువ గొలుసును ఎలా మార్చివేయవచ్చనే దానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘సాగు బాగు’ ఓ చక్కటి ఉదాహరణ. వాల్యూ చైన్‌లో ఎదురయ్యే సవాళ్లకు నిర్దిష్టమైన పరిష్కారాలనుఅందించడం ఈ ప్రాజెక్టులోని కీలక అంశం. 2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ మద్దతుతో డిజిటల్ గ్రీన్ సంస్థ అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పైలట్ దశలో ప్రస్తుతం ఓ జిల్లాలోని 7,000కు పైగా మిర్చి రైతులు ఎఐ ఆధారిత సలహాలు, భూసార పరీక్ష, ఉత్పత్తి నాణ్యత పరీక్ష, ఇకామర్స్ అనే నాలుగు ముఖ్యమైన అగ్రిటెక్ సేవలను పొందుతున్నారు. 2023నుంచి ప్రారంభమయ్యే రెండో దశలో ఇప్పుడున్న వాటితో పాటుగా అదనపు అగ్రిటెక్ సేవలను మూడు జిల్లాల్లోని 20,000 మంది మిర్చి, వేరుసెనగ రైతులకు అందించాలని ప్రభుత్వం అనుకొంటోంది. రెండో దశలో డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలను కూడా ప్రవేశపెడతారు. మూడో దశలో (2025 నాటికి) రాష్ట్రంలోని లక్ష మంది రైతులకు ఈ సేవలు చేరాలనేది లక్షం.

అగ్రికల్చర్ శాండ్‌బాక్స్
అగ్రిటెక్ సేవల్లో ఆర్థిక సేవలు, ఇ కామర్స్, సలహాలు సొందడం లాంటివి ఉంటాయి. వీటిలో సలహాలు చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఎందుకంటే తప్పుడు సలహా రైతుల ఆదాయంపై తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజుకు కూడా చాలావరకు సలహాలు అనూచానంగా పాటిస్తూ వస్తున్న పద్ధతులు లేదా వాతావరణం, చీడపీడలు వంటి వాటికి స్పందించే ప్రత్యేకమైన డైనమిక్ సలహాలు వంటివి మాత్రమే ఉంటున్నాయి. అయితే కృత్రిమ మేధ(ఎఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చైన్, స్టీరియో స్కోపీ లాంటి ఆధునిక డిజిటల్ టెక్నాలజీలు స్థానికంగా సృష్టించబడిన సంప్రదాయ సలహాలను పక్కకు నెట్టి వేసి పంట ఉత్పత్తులు, నాణ్యతా పరీక్షలకు సత్వర సలహాలను అందిస్తున్నాయి. అయితే సంప్రదాయ సలహాల లాగా కాకుండా ఈ ఆధునిక టెక్నాలజీ ఆధారిత సలహాల వల్ల ఎదురయ్యే ప్రతికూలతలను ఒక స్వతంత్ర సంస్థ అంచనా వేయలేదు. అందువల్ల రైతులకు ఎదురయ్యే రిస్క్‌లనుంచి వారిని కాపాడడానికి అగ్రిటెక్ శాండ్‌బాక్స్‌ను కనుగొనడం జరిగింది. ఈ అగ్రిటెక్ శాండ్‌బాక్స్ అనేది వ్యవసాయ రంగం, టెక్నాలజీ వర్తించే నిబంధనలకు సంబంధించిన నియమ నిబంధనలకు లోబడి ఒక కొత్త ఉత్పత్తి లేదా సర్వీసును పరిమిత స్థాయిలో పరీక్ష చేయడానికి వినూత్న సాంకేతికతతో పని చేసే సంస్థలకు నిర్దిష్టమైన వాతావరణాన్ని అందిస్తుంది.

అగ్రికల్చర్ డేటా ఎక్స్‌చేంజి(ఎడిఇఎక్స్)
వ్యవసాయ రంగంతో సంబంధాలున్న పలువురు భాగస్వాముల సంప్రదింపుల ద్వారా రూపొందించబడిన ఇది మెరుగైన, విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన డేటాను పంచుకోవడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మార్పు చేయడానికి ఉద్దేశించబడింది. రైతులకు డిజిటల్ సేవలను అందించడం ద్వారా వినియోగదారులు డేటాను కనుగొని , పంచుకోవడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇండియా) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తో కలిసి అందరికీ అందుబాటులో ఉండే ఒక ఓపెన్ సోర్స్ టెక్నాలజీ వేదికను అభివృద్ధి చేస్తోంది, ప్రారంభ దశలో ఎడిఇఎక్స్ ప్రధానంగా భూసారసలహాలు, చీడపీడల అంచనాలు, రోజువారీ మార్కెట్ ధరలు, ర్రుణ సదుపాయం అంచనా లాంటి వాటిపై పని చేస్తుంది.అగ్రికల్చర్ డేటా మేనేజిమెంట్ ఫ్రేమ్‌వర్క్‌బాధ్యతాయుతమైన డేటా షేరింగ్ వాతావరణం ఉండేలా చూడడం కోసం వ్యవసాయ రంగం కోసం రూపొందించబడిన మొట్టమెదదటి సమగ్రమైన డేలా మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ ఇది. వినియోగదారులను కాపాడడం, నష్టాన్ని నివారించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం అనే 3పి వైఖరికి ఇది కట్టుబడి ఉంటుంది.

అందరూ అనుసరించాల్సిన పద్ధతి
ఆర్థిక భారం లేని, ఉన్నతమైన వ్యవసాయ రంగ సాంకేతిక సేవలను పెంచడంలో ప్రభుత్వాలు ఒక ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని తెలంగాణ అనుభవం ఎత్తి చూపిస్తోంది. అవి జరిపే కృషి ఆ రంగంపై ప్రధానంగా దృష్టిపెట్టే విధంగా, నిర్మాణాత్మకంగా, ఫలితాలు సాధించే విధంగా ఉండాలంటే వాల్యూ చైన్‌లు, భౌగోళిక పరిస్థితులపైన కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలపై పెట్ట్టుబడి ప్రభుత్వాలు తప్పక భరించాల్సిన ఖర్చు. అయితే దాని వల్ల తిరిగి లభించే ఫలితాలు మాత్రం ఊహించనంతగా ఉంటాయి. ఎందుకంటే అవి ఉత్పత్తిని, ఆదాయాన్ని పెంచడం ద్వారా అటు ప్రైవేటు రంగానికి, ఇటు రైతుకు మేలు చేస్తాయి. పిపిపి విధానం అనేది ఇదే విధమైన వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే ఇతర రాష్ట్రాలు, దేశాలు పాటించదగ్గదని చాటి చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News