Friday, January 31, 2025

1నుంచి భూభారతి అమలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి నూత న ఆర్వోఆర్ చట్టం 2025 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ బాధ్యతలు చూస్తున్న టెర్రాసిస్ గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోనుండగా ధరణి పోర్టల్ కు కాలం చెల్లిపోనుంది. దీంతో భూభారతి పోర్టల్ ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) పూ ర్తిస్థాయిలో నిర్వహించనుంది. ధరణి పోర్టల్ పూర్తి వివరాలను ఎన్‌ఐసికి టెర్రాసిస్ బదిలీ చే యనుంది. ఇది పూర్తి కాగానే భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ధ రణిని అడ్డుపెట్టుకొని కొల్లగొట్టిన భూముల

లెక్క లు తేల్చాలని ధరణి భూ కుంభకోణంలో పాత్రతో పాటు రెవెన్యూ కీలక అ ధికారుల పాత్రను గుర్తించనున్నారు. ఈ కుంభకోణంలో సుమారు రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల పరమైనట్లు ప్రస్తుతం గుర్తించిం ది. ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15వేల ఎకరాలు మాయమయినట్టుగా అధికారులు నివేదిక అందించారు. ఫోరెన్సిక్ ఆడిట్లో ధరణి లా వాదేవీల హిస్టరీ ద్వారా ఈ విషయాలన్నీ వెల్లడి కానున్నట్లు ప్రభుత్వం ఫోరెన్సి క్ ఆడిట్ తర్వాత విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News