వెనకబడిన వర్గాల వైపే
అధిష్టానం మొగ్గు
భవిష్యత్ విజయాలకు
తోడ్పడుతుందని యోచన
సంఘ్ పరివార్, ఎబివిపి
నేపథ్యం ఉన్నవారికి
అవకాశం ఇవ్వాలని మరో
వర్గం విశ్వప్రయత్నాలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజ యం సాధించి జోష్‌లో ఉన్న భారతీ య జనతా పార్టీ (బిజెపి) దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టేందుకు వ్యూ హరచన చేస్తోంది. ఇందుకు తెలంగాణ నుంచే ఆ ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తోంది. బీజేపీ అ గ్ర నాయకత్వం ఈసారి తెలంగాణపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ప్రస్తు తం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. దీని లో భాగంగా బిజెపి రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ హైకమాం డ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగా ణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం ప్రకటన రానుందని తెలిసిం ది.
సామాజిక సమీకరణాలతో రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై పార్టీ అగ్రనాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలంగాణలో ఇప్పుడు బిసిల నినా దం మారు మోగడం, బిసిలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందనే విమర్శలను బిజెపి గుప్పిస్తోంది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలతో బీజేపీ బీసీ సీఎం నినాదం తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకోవడమే కాకు ండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎనిమిది ఎంపి స్థానాలను తన ఖాతాలో వేసుకోవడంతో బి జెపి తెలంగాణపైన పట్టు సాధించినట్లు పార్టీ నాయకత్వం భావించింది. గత అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించి ఆ స్థా నంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కీలక పదవులు అగ్రనేతలకే ఇస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బిసి కోటాలో ఈటల వైపే మొగ్గు..?
దీనిలో భాగంగా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మిగిలిన కీలక బాధ్యతల్లో సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేయాలని యోచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడాలంటే పార్టీ పదవుల్లో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనివార్యంగా మారుతోంది. ఈ క్రమంలో బిసిలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బిసిల తరఫున ఉందనే నమ్మకం కలిగించాలని అంతర్గతంగా చర్చ నడుస్తోంది. బిసి అనగానే గుర్తొచ్చేది పార్టీలో కీలకంగా ఉన్న ముదిరాజ్ వర్గానికి చెందిన మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్. బిసి వర్గం నుంచి దాదాపుగా ఈటల పేరు ఖరారైందని పార్టీలో చర్చ జరుగుతోంది. అలాగే ఒసి సామాజిక వర్గం నుంచి తాజాగా డికె అరుణ, మురళీధర్‌రావు పేర్లు కూడా వినిస్తున్నాయి. సామాజిక అంచనాల నేపధ్యంలో బిసి నేతకే అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. సంఘ్‌పరివార్, ఏబివిపి నేపధ్యం కలిగిన వారిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలనే ఉద్దేశ్యంతో మరో వర్గం ఢిల్లీలో విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఈ కోటాలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు ప్రయత్నిస్తూ ముందు వరుసలో ఉన్నారని తెలిసింది.అయితే అగ్రనాయకత్వం ముందు ఈ ప్రతిపాదన పెట్టినా క్షేత్రస్థాయిలో పార్టీకి ఎంత మైలేజ్ వస్తుందో వారికే పదవులు ఇవ్వడం మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, బిజెపి శాసనసభ పక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు అగ్రవర్గానికి చెందిన వారే కావడం, ఇద్దరూ రెండు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. మరోసారి అధ్యక్ష పదవిని బిసి కాకుండా అగ్రవర్ణానికి ఇస్తే పార్టీలో మైనస్ అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
కానీ ఆయన రెండు పదవులు నిర్వహించడం సాధ్యం కాదని ఒకటి రెండు సందర్భాల్లో స్పష్టం చేశారు. దీంతో బీసీ వర్గానికే అధ్యక్ష పదవి ఖాయమైతే రేసులో ఉన్న సీనియర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనేది పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి రావాలంటే సామాజిక వర్గ అంచనాలు తప్పనిసరిగా భావిస్తున్నారు. కాగా ఢిల్లీ ఎన్నిక లు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ పార్టీ నాయకత్వం నిర్ణయం ప్రకటనలో ఆలస్యం జరుగు తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే పేరు వెల్లడి అవుతుందని పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నప్పటికీ, ఎప్పుడు వెల్లడిస్తారో ఇంకా స్పష్టత లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఫిబ్రవరి 15 నాటికి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఆలస్యం కావడానికి ఒక కారణంగా తెలుస్తోంది.