హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో రాజకీయం రసవత్తరంగా మారింది. కిషన్‌రెడ్డికి కొత్తగా బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల చేపట్టనప్పటి నుంచి ఇంతవరకు కొత్త పదవిపై ఆయన స్పందించలేదు. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంపై బండి సంజయ్ అసంతృప్తితోనే ఉన్నారు. కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు బండి సంజయ్ ఇష్టపడడంలేదు. ఈటలకు పదవిపై మరికొందరు బిజెపి నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: గడ్డి పరకలను గడ్డపారలుగా మార్చిన యోధుడు
ఈటల రాజేందర్ కు పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంతవరకు పెదవి విప్పలేదు. ఇటీవలే ఈటలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసి ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలకు కలిశారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడి మార్పు సమస్య తీర్చిందా? కొత్త సమస్య తెచ్చిందా? అనేది వేచి చూడాలి. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్‌రెడ్డి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోనే ఉన్నా సమావేశానికి కిషన్‌రెడ్డి హాజరుకాలేదు. మంత్రిత్వ శాఖ అధికారులు కిషన్‌రెడ్డి ఇంటికి రాలేదు. కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు.