- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 7.30 గంటలకు చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మిఆలయం పూజలు, అనంతరం అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి బషీర్‌బాద్ కనకదుర్గ ఆలయం సందర్శన అనంతరం ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి, గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.45 నిమిషాలకు నుంచి నేరుగా నాంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరుకొని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు.
Also Read: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం…
- Advertisement -