Wednesday, January 15, 2025

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఈ ఎపిసెట్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఈఎపిసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, మే 2 నుంచి 5 వరకు ఈఎపిసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈఎపిసెట్ పరీక్షలు జెఎన్‌టియు నిర్వహిస్తోంది. టిజి ఈఎపిసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ వ్యవహరిస్తున్నారు. డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈ సెట్ మే 12న నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈసెట్ కన్వీనర్‌గా ఓయు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ. చంద్రశేఖర్ వ్యవహరిస్తారు. బిఈడి ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ జూన్ 1న జరుగనుంది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్ కన్వీనర్‌గా కెయు ప్రొ. బి. వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఎల్‌ఎల్‌బి ప్రవేశాల కోసం లాసెట్, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల కోసం పిజిఎల్ సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు.

లాసెట్, పిజిఎల్ సెట్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. దీనికి కన్వీనర్‌గా ప్రొ. బి. విజయలక్ష్మి కొనసాగుతున్నారు. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8,9 తేదీల్లో ఐసెట్ నిర్వహించనున్నారు. ఐసెట్‌ను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుండగా ప్రొఫెసర్ అలువాల రవి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 19 వరకు పిజిఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జెఎన్‌టియుహెచ్ నిర్వహించే ఈ పరీక్షలకు కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎ. అరుణ కుమారి వ్యవహరిస్తారు. వ్యాయామ విద్య కోర్సులు డిపెడ్, బిపెడ్‌లలో ప్రవేశాల కోసం జూన్ 11 నుండి 14 వరకు పిఈసెట్ నిర్వహిస్తారు. పాలమూరు యూనివర్సిటీ నిర్వహించే పిఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎన్‌ఎస్ దిలీప్ వ్యవస్తారు. పిఈసెట్ మినహా మిగతా పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News