Monday, December 23, 2024

నోవోటెల్ హోటల్‌లో తెలంగాణ బోనాల పండుగా

- Advertisement -
- Advertisement -

మాదాపూర్ ః తెలంగాణ రాష్ట్ర పండుగా అయిన బోనాల పండుగను నోవోటెల్ హోటల్‌లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని హోటల్ జనరల్ మేనేజర్ రూబిన్ చెరియస్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి నుండి ఈ నెల 16వ తేదీ వరకు నోవోటెల్ హోటల్‌లో బోనాల పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ యొక్క గొప్ప రుచులు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించాలని మేము లక్షంగా పెట్టుకున్నామన్నారు. అందుకు నోవోటెల్ హోటల్‌లో ప్రత్యేక బ్రంచ్‌ను అందించడం జరుగుతుందన్నారు. రుచికరమైన ఆహర ప్రయాణం ప్రారంభమవుతుందన్నారు. అతిథులు చికెన్ కలేజీ ప్రై, తెలంగాణ కోడి రోస్ట్, తవా ఫిష్, మాంసం దమ్ బిర్యానీ, చేపల పులుసుతో సహ నోరూరించే వంటకాలను ఆస్వాదించే అవకాశం అతిథులు కలుగుతుందన్నారు. నువ్వుల లడ్డు, సాబుదానపాయసం, బొబ్బట్లు అనేక రకాల వంటకాలతో ముగుస్తుందన్నారు. స్థానిక పండుగల స్పూర్తిని మరింతగా ముందుకు తీసుకెవెళ్తూ అసాధారణమైన భోజన అనుభవాలను అందించడంలో నోవోటెల్ హోటల్ నిబద్దతను చాటుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నోవోటెల్ హోటల్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News