Thursday, January 23, 2025

రూ.1.85 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ రంగాలకు ఆర్ధికంగా చేయూతనిస్తూ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి బాటలు వే సేలా రూ.1,85,326.68కోట్ల తో 2023-24కు వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. గురువారం మారియట్ హోటల్‌లో నాబా ర్డు సిజిఎం చింతల సుశీల అధ్యక్షతన జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్‌లో రాష్ట్ర అ ర్థిక , వైద్య ఆరోగ్యశాఖల మంత్రిహరీష్ రావు ఈ రుణ ప్రణాళికను విడుదల చేశారు. రుణ ప్రణాళికలో ఎప్పటిలాగే వ్యవసాయం , వాటి అనుబంధ రంగాలకు అధిక ప్రధాన్యత కల్పించి ఆ మేరకు నిధుల కేటాయింపులు చేశారు. సూక్ష్మ , చిన్న మధ్య తరహా వ్యాపార ,పారిశ్రామిక రంగాలకు రుణ ప్రణాళికలో సముచిత స్థానం లభించింది.వ్యవసాయం వాటి అనుబంధరంగాలకు మొత్తం రూ.1,12.762కోట్లు కేటాయించారు. విద్యరంగంతోపాటు గృహ నిర్మాణం, రెన్యువబుల్ ఎనర్జీ, ఎస్‌హెచ్‌జి తదితర రంగాల అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించారు.

ఆయా రంగాల వారీగా వ్యవసాయరంగంలో పంటల పెట్టుబడికోసం క్రాప్‌లోన్స్‌కింద రూ.73,436కోట్లు కేటాయించారు. నీటివనరుల అభివృద్దికి రూ.1245కోట్లు, వ్యవసాయ యాత్రీకరణకు రూ.4496కోట్లు, హార్టీకల్చర్ , సెరికల్చర్ రంగాలకు రూ.3760కోట్లు, అడవులు, వేస్ట్ ల్యాండ్ అభివృద్ధికి రూ.157కోట్లు కేటాయించారు. పాడిపరిశ్రమ రంగానికి కూ.2771కోట్లు, కోళ్ల పరిశ్రమ రంగానికి రూ.1551కోట్లు , గొర్రెలు, మేకలు, పందుల అభివృద్ధికి రూ.1456కోట్లు, మత్స పరిశ్రమ రంగానికి రూ.257కోట్లు, సమగ్ర వ్యవసాయ రంగానికి రూ.257కోట్లు కేటాయించారు. ఫాం క్రెడిట్ కింద ఈ రంగాలన్నింటికీ రుణ ప్రణాళికలో మొత్తం రూ.91351కోట్లు కేటాయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.4562కోట్లు వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయల అభివృద్దికి రూ.4562కోట్లు కేటాయించారు.

ఇందులో మార్కెటింగ్ గిడ్డంగుల నిల్వ సదుపాయాల అభివృద్ధి కోసం రూ.3081కోట్లు, భూముల అభివృద్ధి వాటర్‌షెడ్ కార్యక్రమాలకోసం రూ.822కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.658 కోట్లు కేటాయించారు. వ్యవసాయ అనురబంధ రంగాల్లోని మరికొన్నింటిలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు రూ.3005కోట్లు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు ఎస్‌హెచ్‌జి తదితర వాటికి రూ.13842కోట్లు కేటాయించారు. ఎంఎస్‌ఎంఇకి రూ.54672కోట్లు సూక్ష్మ చిన్న , మధ్యతరహా పరిశ్రమలు , వ్యాపార రంగాల అభివృద్ధికి రూ.54672కోట్లు కేటాయించారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు రూ.393 కోట్లు కేటాయించారు. విద్యారంగానికి రూ.3149కోట్లు, గృహనిర్మాణ రంగానికి రూ.11675కోట్లు కేటాయించారు.

పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధికి రూ.536కోట్లు కేటాయించారు. ఎస్‌హెచ్‌జి, జెఎల్‌జి ,స్వయం ఉపాధి రంగాలకు రూ.578కోట్లు కేటాయించారు. సామాజిక మౌలిక సదుపాయాల కింద రూ.1557కోట్లు కేటాయించారు. అన్నిరంగాలకు మొత్తం రూ1,85,326.68 కోట్లతో రూపొందించి విడుదల చేసిన క్రెడిట్ ప్లాన్ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News