Monday, December 23, 2024

బిఎస్‌సి నర్సింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో బిఎస్‌సి నర్సింగ్, పోస్టు బిఎస్‌సి నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసిం ది. నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బిఎస్‌సి నర్సింగ్ ),రెండేళ్ల బేసి క్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాను, సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అర్హులైన విద్యార్థులు ఆదివారం(అక్టోబర్ 1) ఉదయం 8 గంటల నుండి 4 వ తేదీ మ ధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పిడబ్లూడి అభ్యర్థులతో సహా అర్హులైన అభ్యర్థులు అందరూ కోర్సు, కళాశాలల వారీగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలలి. మరింత సమాచా రం కోస యూనివర్సిటీ వెబ్‌సైట్ www. knruhs.telangana. gov.inలో చూడాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపారు.

6 వరకు ఎంఎస్‌సి నర్సింగ్‌కు రిజిస్ట్రేషన్లు
ఎంఎస్‌సి నర్సింగ్, ఎంపిటి కన్వీనర్ కోటా సీట్లకు భర్తీకి కాళోజి నా రాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిం ది. ఆదివారం(అక్టోబర్ 1) ఉదయం 8 గంటల నుండి 7వ తేదీ సాయం త్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News