Sunday, December 22, 2024

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఆటంకం కల్గిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రప్రగతికి కేంద్రం అడ్డంకులు మీద అడ్డంకులు సృష్టిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ రుణపరిమితిని కేంద్రం అసంబద్ధంగా తగ్గించిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోందన్నారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకు పెట్టిందన్నారు. కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని, విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని, నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. విభజన సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బంది పెడుతోందని, ట్రైబ్యునల్ తీర్పుల పేరిట దశాబ్ధాల పేరిట జాప్యం చేస్తుందన్నారు. ఎపి నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పింటమంటే పట్టించుకోవడంలేదని హరీష్ రావు దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం సహకారం లేకున్నా తెలంగాణ గణనీయంగా ప్రగతి సాధిస్తోందన్నారు.

2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర నికర అప్పులు రూ.3,57,059 కోట్లుగా ఉండగా అప్పుల శాతం 23.8 శాతంగా ఉంది.

రాష్ట్ర బడ్జెట్: రూ.2,90,396 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,11,685 కోట్లు
రెవెన్యూ రాబడుల అంచనా: రూ.2,16,566 కోట్లు
సొంత పన్నుల ఆదాయం: రూ.1,31,028 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు
2023-24లో రుణాలు రూ.46,317 కోట్లు
పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు
గ్రాంట్లు అంచనా రూ.41,259 కోట్లు

మూలధన వ్యయం: రూ.37,525 కోట్లు
వ్యవసాయానికి కేటాయింపులు రూ.26,831 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు
విద్యుత్ కేటాయింపులు రూ.12,727 కోట్లు
ఆసరా ఫించన్ల కోసం రూ.12,000 కోట్లు
దళితబంధు కోసం రూ.17,700 కోట్లు
ఎస్‌సి ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
ఎస్‌టి ప్రత్యేక నిధి కోసం రూ.15,233 కోట్లు
బిసి సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ.2200 కోట్లు
అటవీ శాఖ కోసం రూ.1471 కోట్లు
విద్య కోసం రూ.19093 కోట్లు
వైద్య కోసం రూ.12,161 కోట్లు

రుణమాఫీ కోసం రూ.6385 కోట్లు

ప్రత్యేక అభివృద్ది నిధి కోసం రూ.10,348 కోట్లు

స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ.18500 కోట్లు
ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ.19,884 కోట్లు
అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ.39,500 కోట్లు
వాహనాల పన్ను ఆదాయం అంచనా రూ.7512 కోట్లు

ఆయిల్ ఫామ్ సాగు కోసం రూ.1000 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం రూ.3117 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ కోసం రూ.31,426 కోట్లు
పురపాలక శాఖ కోసం రూ.11,372 కోట్లు
రోడ్లు, భవనా మరమ్మతుల కోసం రూ.2500 కోట్లు
అటవీ శాఖ, హరితహారం కోసం రూ.1471 కోట్లు
పరిశ్రమల శాఖ కోసం రూ.4037 కోట్లు
హోంశాఖ కోసం రూ.9599 కోట్లు
మహిళా విశ్వవిద్యాలయం కోసం రూ.100 కోట్లు
అటవీ కళాశాల కోసం రూ.100 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం రూ.200 కోట్లు
యాదాద్రి ఆలయం అభివృద్ధి కోసం రూ.200 కోట్లు
కాళేశ్వరం టూరిజం సర్కూట్ కోసం రూ.750 కోట్లు
వర్సిటీల్లో మౌళిక వసతుల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు
సుంకిశాల ప్రాజెక్టు కోసం రూ.725 కోట్లు
విమానాశ్రయ మెట్రో కోసం రూ.500 కోట్లు

రెండు పడకల గదుల ఇళ్ల కోసం రూ.12000 కోట్లు

పాతబస్తీ మెట్రో రైలు కోసం రూ.500 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైలు కోసం రూ.1500 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం రూ.3117 కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News