- Advertisement -
అసెంబ్లీలో ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ శనివారం ప్రారంభం అయింది. తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారు. తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ బడ్జెట్ రూ.2,75,891 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు. మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు అని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.
- Advertisement -