Friday, December 20, 2024

తెలంగాణ 2024-25 బడ్జెట్ విశేషాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తరువాత ఆశించిన అభివృద్ధి జరగలేదని, అప్పులు మాత్రం పది రెట్లు పెరిగాయని  ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసన సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే దాశరథి కవితతో’ బడ్జెట్‌ను భట్టి ప్రారంభించారు. గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని, గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగడంతో అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేర్చలేదని, గత ప్రభుత్వం ఆర్థిక క్రమ శిక్షణ పాటించలేదని, జీతాలు, పింఛన్ల చెల్లింపులకు కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. గత ప్రభుత్వంలో నాయకులు బంగారు తెలంగాణ అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని భట్టి ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వ విధానాలతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, దిద్దుబాటు చర్యలు చేపట్టి మేలైన ప్రాజెక్టులు నిర్మిస్తామని, ఇప్పటివరకు రూ.34,579 కోట్లు వివిధ పథకాలకు ఖర్చు చేశామని వివరించారు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నియామకాల్లో పారదర్శకతకు చర్యలు తీసుకుంటామని, త్వరలో నియామక ప్రణాళిక క్యాలెండర్ ప్రకటన ఇస్తామని భట్టి హామీ ఇచ్చారు. రైతు భరోసా సహా హామీలన్నీ త్వరలోనే అమలు చేసి తీరుతామని, బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదన్నారు. బడ్జెట్ అనేది విలువలు, ఆశల వ్యక్తీకరణ కూడా వస్తుందని తెలియజేశారు.

తెలంగాణ బడ్జెట్ విశేషాలు:

తెలంగాణ బడ్జెట్: రూ.2,91,159 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ. 2, 20, 945 కోట్లు
మూలధన వ్యయం: రూ.33,487 కోట్లు

వ్యవసాయం: రూ.72,659 కోట్లు
ఎస్‌సి సంక్షేమం: రూ.33,124 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ.29,816 కోట్లు
నీటి పారుదల శాఖ: రూ.22,301 కోట్లు
విద్యారంగం: రూ.21,292 కోట్లు
ఎస్‌టి సంక్షేమం: రూ.17056 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలు: రూ.16,410 కోట్లు
వైద్య ఆరోగ్యం: రూ.11,468 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధికి: రూ.10000 కోట్లు
బిసి సంక్షేమం: రూ.9200 కోట్లు
హోంశాఖ: రూ.9,564 కోట్లు
ఆర్ అండ్ బి శాఖ: రూ.5790 కోట్లు
ప్రజాపంపిణీకి: రూ.3,836 కోట్లు
మెట్రో వాటర్ వర్క్: రూ.3,385 కోట్లు
జిహెచ్‌ఎంసి మౌలిక వసతుల కల్పన: రూ.3,065 కోట్లు
మైనార్టీ సంక్షేమం: రూ.3003 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం: రూ.2736 కోట్లు
పరిశ్రమల శాఖ: 2762 కోట్లు
గృహజ్యోతి పథకం: రూ.2418 కోట్లు
పశుసంవర్థకం: రూ.1980 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు: రూ.1500 కోట్లు
ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు: రూ.1525 కోట్లు
అడవులు, పర్యావరణం: రూ.1064 కోట్లు
రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం: రూ.723 కోట్లు
ఉద్యానవనం: రూ. 737 కోట్లు
ఐటి రంగం: రూ.774 కోట్లు
హైడ్రా సంస్థ: రూ.200 కోట్లు
పాతబస్తీ మెట్రో విస్తరణ: రూ.500 కోట్లు
హెచ్‌ఎండిఎలో మౌలిక వసతుల కల్పన: రూ.500 కోట్లు
విమానాశ్రయ వరకు మెట్రో విస్తరణ: రూ.100 కోట్లు

మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్: రూ.50 కోట్లు

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News