2లక్షల కోట్లు దాటిన రాష్ట్ర పద్దు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లు దాటింది. 2021..2022 ఆర్థ్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.2,30,825.96 కోట్లతో ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం (20202021) బడ్జెట్ మొత్తం రూ. 1,82,914.12 కోట్లు. ఈ బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రూ.47,911.54 కో ట్ల మేర ప్రతిపాదనలు పెరిగాయి. గత బ డ్జెట్‌తో పోలిస్తే ఇది 26.19 శాతం పెరుగు దల నమోదైంది. మొత్తం రెవె న్యూ వ్యయం – రూ.1,69,383.44 కోట్లు కాగా, ఆర్థిక లోటు అంచనా 45,509.60 కోట్లు, పెట్టుబడి వ్యయం -రూ.29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు – రూ.6,743.50 కోట్లు, పన్నుల ఆదాయం అంచనా -రూ. 92,910 కోట్లు, పన్నేతర ఆదాయం – రూ.30,557.35 కోట్లు, గ్రాం ట్ల అంచనా రూ.38,669.46 కోట్లు, కేం ద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 13,990.13 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా – రూ.12,500 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం అంచనా – రూ.17వేల కో ట్లు, అమ్మకం పన్ను ఆదాయం – రూ. 26,500 కోట్లు, వాహనాల పన్ను – రూ. 5వేల కోట్లు వస్తుందని అంచనా వేసింది. 202120-22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పు రూ.2,86,804.64 కోట్లుకు చేరనుంది. ఇది జిఎస్‌డిపిలో అప్పుల శాతం 24.84 శాతంగా ఉంది.