హైదరాబాద్: తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోందన్న స్థాయిలో రాష్ట్రం దూసుకపోతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్షోభ సమయంలోనూ సంక్షేమం ఆగలేదని, అన్ని సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుకూలంగా సమగ్రాభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జిఎస్‌డిపి క్రమేణా పెరుగుతూ వచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఊరురూవాడ చర్చ జరుగుతోందన్నారు.
2019-20 సంవత్సరానిని జిఎస్‌డిపి వృద్ధి రేటు 13.2 శాతానికి పెరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా తలసరి ఆదాయం 11.8 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని హరీష్ రావు ప్రశంసించారు. దేశ జిడిపిలో తెలంగాణ జిడిపి శాతం 4.9 కావడం గర్వకారణమని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రధాన రంగాల్లో అనుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు కనిపించిందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో మెరుగైన వృద్ధి రేటు కనిపించిందని వివరించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లనే ఈ వృద్ధి రేటు సాధ్యమైందని, జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 86 శాతం ఎక్కువగా ఉందని ఆయన తెలియజేశారు. తలసరి ఆదాయం రూ.3,17,155గా అంచనా వేశామన్నారు.
2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర నికర అప్పులు రూ.3,57,059 కోట్లుగా ఉండగా అప్పుల శాతం 23.8 శాతంగా ఉంది.
రాష్ట్ర బడ్జెట్: రూ.2,90,396 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,11,685 కోట్లు
రెవెన్యూ రాబడుల అంచనా: రూ.2,16,566 కోట్లు
సొంత పన్నుల ఆదాయం: రూ.1,31,028 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు
2023-24లో రుణాలు రూ.46,317 కోట్లు
పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు
గ్రాంట్లు అంచనా రూ.41,259 కోట్లు
మూలధన వ్యయం: రూ.37,525 కోట్లు
వ్యవసాయానికి కేటాయింపులు రూ.26,831 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు
విద్యుత్ కేటాయింపులు రూ.12,727 కోట్లు
ఆసరా ఫించన్ల కోసం రూ.12,000 కోట్లు
దళితబంధు కోసం రూ.17,700 కోట్లు
ఎస్‌సి ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
ఎస్‌టి ప్రత్యేక నిధి కోసం రూ.15,233 కోట్లు
బిసి సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ.2200 కోట్లు
అటవీ శాఖ కోసం రూ.1471 కోట్లు
విద్య కోసం రూ.19093 కోట్లు
వైద్య కోసం రూ.12,161 కోట్లు
రుణమాఫీ కోసం రూ.6385 కోట్లు
ప్రత్యేక అభివృద్ది నిధి కోసం రూ.10,348 కోట్లు
స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ.18500 కోట్లు
ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ.19,884 కోట్లు
అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ.39,500 కోట్లు
వాహనాల పన్ను ఆదాయం అంచనా రూ.7512 కోట్లు
ఆయిల్ ఫామ్ సాగు కోసం రూ.1000 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం రూ.3117 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ కోసం రూ.31,426 కోట్లు
పురపాలక శాఖ కోసం రూ.11,372 కోట్లు
రోడ్లు, భవనా మరమ్మతుల కోసం రూ.2500 కోట్లు
అటవీ శాఖ, హరితహారం కోసం రూ.1471 కోట్లు
పరిశ్రమల శాఖ కోసం రూ.4037 కోట్లు
హోంశాఖ కోసం రూ.9599 కోట్లు
మహిళా విశ్వవిద్యాలయం కోసం రూ.100 కోట్లు
అటవీ కళాశాల కోసం రూ.100 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం రూ.200 కోట్లు
యాదాద్రి ఆలయం అభివృద్ధి కోసం రూ.200 కోట్లు
కాళేశ్వరం టూరిజం సర్కూట్ కోసం రూ.750 కోట్లు
వర్సిటీల్లో మౌళిక వసతుల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు
సుంకిశాల ప్రాజెక్టు కోసం రూ.725 కోట్లు
విమానాశ్రయ మెట్రో కోసం రూ.500 కోట్లు
వడ్డలేని రుణాల కోసం రూ.1500 కోట్లు
రెండు పడకల గదుల ఇళ్ల కోసం రూ.12000 కోట్లు
పాతబస్తీ మెట్రో రైలు కోసం రూ.500 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైలు కోసం రూ.1500 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం రూ.3117 కోట్లు