Tuesday, March 11, 2025

ఈ నెల12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12న ప్రారంభమై 27 వరకు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు బుధవారం ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ నెల 13 గురువారం సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.

ఆ మరుసటి రోజు 14న హోలీ పండుగ సెలవు దినం కావడంతో ఈ నెల 15 శనివారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయా, లేక శని, ఆదివారాలు సెలవు దినాలు మినహాయించి సోమవారం 17 నుంచి సమావేశాలు నిరవధికంగా కొనసాగే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. అయితే బడ్జెట్ ఏ రోజు ప్రవేశ పెడుతారు, పద్దులపై ఎన్ని రోజులు చర్చిస్తారు అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News