- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ. 53,196 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో ఆయన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. భట్టి ఇంతవరకూ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
• ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నాం.
• అమరుల కలలను నిజం చేస్తాం
• తెలంగాణ ప్రజలలో మార్పు తీసుకొస్తాం.
• అందరినీ దృష్టిలో ఉంచుకున బడ్జెట్ ను రూపొందించాం.
• పదేళ్ల తర్వాత నిజమైన స్వేచ్ఛను చూస్తున్నాం
• రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం.
• ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితిని తీసుకొచ్చారు.
• ఉద్యోగులు అప్పులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే రోజులు తీసుకొచ్చారు.
• గత ప్రభుత్వం దళిత బంధు కోసం 17 వేల కోట్లు ఖర్చవుతుంటే, బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
- Advertisement -