బస్సులను శానిటైజ్ చేసిన తర్వాత బయటకు
ఒక్క కేసు నమోదు కాలేదు
ఆర్టిసి అధికారులు
హైదరాబాద్: ప్రభుత్వం లాక్డౌన్ క్రమేపి సడలిస్తుండటంతో ఆర్టిసి అధికారులు ఆదాయంపెంపై దృష్టి సారించారు. కరోనా కారణంగా ఇంత కాలం వ్యక్తిగతవాహనాలు, ఆటోలు, క్యాబ్స్‌లో ప్రయాణించేవారిని తిరిగి ఆర్టిసిలో ప్రయాణించే విధంగా చేస్తున్నారు. మొదటి సారి లాక్‌డౌ న్ సడలింపుల్లో భాగంగా అధికారులు 6 గంటల ను ంచి 10 గంటలవరకు 29 డిపోల నుంచి సుమారు 770 బస్సులను మాత్రమేనడిపారు. రెండో సారిలాక్డౌన్ సడలింపులో భాగంగా ప్రభుత్వ ఉదయం 6 గంటల ను ంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇ వ్వడంతో బస్సుల సంఖ్యను కూడా రెట్టింపు చే శారు. ఒక వైపు కరోనా కేసులు తగ్గుతు న్నా.. అధికారులు బస్సుల సంఖ్య పెం చినా కరోనా ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాక పోవడంతో గ తంలో మాదిరిగా బస్సుల్లో ప్ర యాణించేందుకు భయపడుతున్నారు.
ఒక వేళబస్సులు ఎక్కినా భయం భ యంగానే ప్రయాణిస్తున్నారు. దీంతో అధికారులు వారిలో అపోహలను పోగొట్టి ప్రయాణికులు తమ వ్యక్తిగత వాహనాలను,ఇ తర ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారిని తిరిగి ఆర్టిసిలో ప్రయాణించే విధంగ ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందులో అధికారులు కోవిడ్‌పై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కోవిడ్‌పై అనవసర భయాలు వీడి సు రక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రయాణంలో ఆర్టిలోమాత్రమే సాధ్యం అవుతుందని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29డిపోల్లోని ప్రతి బస్సును ఎప్పటికప్పుడు శుభ్రం చేయడమే కాకుండా బస్సుడిపో నుంచిబయటకు వచ్చేమం దు పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తామని చెబుతున్నారు. అంతే కాకుండా విధులకు హజరయ్యే సిబ్బందిని కూడా ధర్మోస్క్రీనింగ్ చేసిన తర్వాతనే వారిని విధుల్లోకి అనుమతిస్తున్నామని ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని డ్యూటీలు నిర్వహించేందుకు అనుమతిండం లేదని చెబుతున్నారు.
అంతే కాకుండా సిబ్బందిని మాస్కులు ధరిస్తేనే లోపలకు అనుమతిస్తున్నామని,“ నో మాస్క్.. నో ఎంట్రీ ” విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన కండక్టర్లు, డ్రైవర్లను మాత్రమే విధులకు వినియోగిస్తున్నామన్నారు. అంతే కాకుండా ప్రతి బస్సులో ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షాణార్దం శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. కోవిడ్ వైరస్ నివారణకు సం బంధించి పూర్తి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతే కాకుండా ఇంత వరకు ఆర్టిసి బస్సులో ప్రయాణించడంతో ద్వారా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఈ అంశాన్ని ప్రయాణికులకు తెలియ చేస్తున్నారు. బస్సులో ప్రయాణికులకు కూడా మాస్క్ తప్పని సరిగా ధిరించాలంటూ అవగాహన కల్పించడ మే కాకుండా వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు.