Wednesday, January 22, 2025

26న సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం

- Advertisement -
- Advertisement -

ఈ నెల 26న 4 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయం భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ముందుగా నిర్ణయించిన 23వ తేదీకి బదులుగా 26వ తేదీకి కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ సమావేశంలో హైడ్రా, మూసీ నది ప్రక్షాళన, రైతు భరోసా విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఒక ఎకరానికి రూ. 15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైతు భరోసా మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ చేసింది.

వివిధ వర్గాలతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా గైడ్ లైన్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. హైడ్రా ఏర్పాటును హైకోర్టు సమర్థించటం, ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత కల్పించటం లాంటి అంశాలతో పాటు మూసీ ప్రక్షాళన విషయంలో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఆయా అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం శీతాకాల అసెంబ్లీ సమావేశాలను వీలైనంత ముందుకు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News