Monday, December 23, 2024

ముహూర్తం ఖరారు?

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ మొదటివారంలో కేబినెట్ విస్తరణ హస్తినలో జోరుగా లాబీయింగ్

మన తెలంగాణ/ప్రత్యేక ప్రతినిధి:  రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖాయమైనట్టు తెలుస్తున్నది. డిసెంబర్ 4 లేక 5వ తేదీన ఉండే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాల స మాచారం. ఈసారి నలుగురు కొత్త వారికి మంత్రివర్గం లో అవకాశం లభించనుందని ఈ వర్గాలు క చ్చితంగా చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణపై కీలక మంత్రి ఒకరు మీడియాకు ఉప్పు కూడా అం దించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాం గ్రెస్ పార్టీలో రాజకీయం ఊపందుకుంది. మొదటి విడతలో అవకాశం రాని ఆశావాహులు ఎవరి శక్తి మేరకు వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయులు గా ఉన్న నేతలు ఒక వైపు, పార్టీలో చేరిక సందర్భంగా తమ కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని మరో వైపు అధిష్ఠాన పెద్దలతో లాబీయింగ్ చేస్తోన్నట్టు సమాచారం.

కాగా ఇప్పటివరకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభించని జిల్లాలకు చెందిన ఆశావహుల పేర్లు జాబితాలో ముందు ఉండగా, మరో వైపు సామాజిక సమీకరణాలలో తమకు అవకా శం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్న నేతల మ ధ్య పోటీ పెరిగింది. ప్రాతినిధ్యం లభించని ఉమ్మడి నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి వివే క్, ఆయన సోదరుడు వినోద్, ప్రేమ్ సాగర్ రావు పోటీలో ఉన్నారు. వినోద్ తనకే మంత్రి పదవి ఇ వ్వాలని, తన సోదరుడు కుమారుడి కి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చినందున తనకు మాత్రమే మం త్రి పదవి ఇవ్వాలని అధిష్టానం పెద్దల వద్ద డి మాండ్ పెట్టినట్టు తెలిసింది.

ఉమ్మడి నల్లగొండ జి ల్లా నుంచి మంత్రివర్గంలో ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నప్పటికీ కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి ప దవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసిం ది. తనకు హోం మంత్రి ఇవ్వాలని కోరుతున్నట్టు కూడా ఆయన బాహాటంగానే చెబుతుండగా, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం సాధ్యం కాదని ఆ యన సోదరుడు, మంత్రి వెంకట్ రెడ్డి అడ్డుపడుతున్నట్టు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. కాగా మరో వైపు రాజగోపాల్ రెడ్డి కి ఇస్తే తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని లేని పక్షంలో ఎస్టీ కోట కింద అదే జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కి అవకాశం ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

ఒకవేళ బాలు నాయక్‌ను మంత్రి వర్గంలోకి తీసుకుంటే తన భార్య పద్మావతికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్ డిమాండ్ చేస్తోన్నట్టు సమాచారం. ఇలా ఉండగా పద్మావతి కి ఇప్పటికే అంచనాల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఆమె ఇప్పటివరకు బాధ్యతలు తీసుకోలేదు. కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవి పై రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. కాగా అధికార వికేంద్రీకరణ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు పార్టీ లో చర్చ సాగుతోంది.

మహబూబ్‌నగర్ నుంచి ముదిరాజ్ కోట లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కి అవకాశం రావచ్చు అనే సంకేతాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించే పక్షంలో మంత్రులలో రెడ్డి సామాజికవర్గం సంఖ్య పెరిగే ప్రమాదం ఉండటంతో మల్‌రెడ్డికి అవకాశం దక్కకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మల్‌రెడ్డికి చీఫ్ విప్‌గా అవకాశం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మైనారిటీ కోటాలో కొత్త వ్యక్తి కి అవకాశం రావచ్చు అని చర్చ సాగుతోంది. మైనారిటీ స్కూల్స్ వైస్ చైర్మన్ ఎమ్ ఏ ఫహీం ఖురేషీ కి మంత్రి పదవి లభించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News