Friday, December 20, 2024

25న కేబినెట్ విస్తరణ?

- Advertisement -
- Advertisement -

ఎప్పుడెప్పుడాని ఎనిమిది నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఎట్టకేలకు ఖ రారు అయినట్టేనని అధికారపార్టీ వర్గాల సమాచారం. ఈనెల 25న మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని ఈ వర్గాలు కచ్చితంగా చెబుతున్నాయి. మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న దానిపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పార్టీ పె ద్దలతో చర్చించినప్పటికీ పీసీసీ అధ్యక్షుని ఎంపికతో ఈ అంశం ముడిపడి ఉండటంతో అధిష్టా నం పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. పీసీసీ అధ్యక్షునిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించడం, ఆయన బాధ్యతలు కూడా చేపట్టడంతో ఇక మం త్రివర్గ విస్తరణపై అధిష్ఠానం దృష్టి సారించినట్టు సమాచారం. ఈ అంశంపై మరోసారి చర్చించడానికి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ఢిల్లీ కి వెళ్తున్నట్టు సమాచారం. అక్కడ తన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించగానే ఈ నెల 25న మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని ఈ వర్గా లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి.

ఇందులో మంత్రి ప్రాతినిథ్యం లభించని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి అవకాశం కల్పించి మిగతా రెండు మంత్రి పదవులను రిజర్వులో పెట్టే అవకాశం లేకపోలేద ని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ప్రాతినిధ్యం లభించని జిల్లాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండటంతో ఆ జిల్లాల నుంచి ఆశావహుల మధ్య గట్టి పోటి నెలకొన్నది. ప్రాతినిథ్యం లేకపోవడం ఒక్కటే కాకుండా సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి కంటోన్మెంట్ మినహా పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరు లేని విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో మరి అవకాశం ఎవరికి కల్పిస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పైగా మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ లోటును ఏ విధంగా భర్తీ చేస్తారు? సీఎం రేవంత్‌రెడ్డి మదిలో ఎవరున్నారు? అనే దానిపై పలు ఉహగానాలు వినిపిస్తున్నాయి.

ఇక మిగతా మూడు జిల్లాలపై పూర్తిగా క్లారిటీ ఉందని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డికి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం కల్పించడంతో పాటు ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఈ ముగ్గురికి బెర్తులు దాదాపు ఖరారు అయినట్టేనని చెబుతున్నారు. ఈ జిల్లా నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కోటా కింద మూడో వ్యక్తి వాకిటి శ్రీహరికి మంత్రిపదవి ఖాయం అయినట్టు ఈ వర్గాల సమాచారం. రాబోయే స్థానిక ఎన్నికలలో బీసీల ఓట్లు గంపగుత్తగా దక్కించకోవడానికి పీసీసీ పదవితో పాటు మంత్రివర్గంలో మరొకరికి అవకాశం కల్పించే కోణంలో కూడా వాకిటి శ్రీహరికి మంత్రిపదవి ఖాయమని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News