సంక్రాంతి లోగా విఆర్‌ఓ వ్యవస్థ ఈ అసెంబ్లీ సమావేశాలలో
ఆర్‌ఒఆర్ చట్టం అది రాగానే మేడ్చల్– రంగారెడ్డి
అక్రమార్కుల చిట్టా బయట పెడుతాం చిట్‌చాట్‌లో
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెలాఖరులోగా (డిసెంబర్ 31) మంత్రివర్గ విస్తర ణఉంటుందని సూచనప్రాయంగా రెవిన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో గురువా రం మీడియాతో మంత్రి చిట్‌చాట్ చేసారు. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ఆర్‌వోఆర్ చ ట్టాన్ని తీసుకవస్తున్నామని, అదిరాగానే మే డ్చెల్–రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ భూఆక్రమణదారుల చిట్టాను సాక్షాధారాలతో సహా బ యటపెడుతామని మంత్రి అన్నారు. అలాగే సంక్రాంతి లోగా విఆర్‌వోల వ్యవస్థను తిరిగి పునర్ధురించబోతున్నామని చెప్పారు. వివిధ విభాగాలలో పని చేస్తోన్న విఆర్‌వోలలో తమ మాతృసంస్థకు తిరిగి వచ్చేవారిని తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఆర్‌వోఆర్ చట్టంలో ఇది వరకే మంచిగా ఉన్న వాటిని కొనససాగిస్తామని అన్నారు. ఇంతటి కీలకమైన చట్టాన్ని తీసుకవస్తున్న ఈ అసెంబ్లీ సెషన్స్‌కు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తాడని అనుకుంటున్నానని మంత్రి పొంగులేటి అన్నారు. కొత్త ఆర్‌వోఆర్ చట్టానికి కేసీఆర్ సూచనలు చేయవచ్చని అన్నారు. ఎనబై వేల పుస్తకాలను నేను కానీ, మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి కానీ చదవలేదన్నారు. అన్ని వేల పుస్తకాలు చదివిన అనుభవం ఉన్న కేసీఆర్ ఇచ్చే సలహాలు, సూచనలను తీసుకుంటామన్నారు. అందుకే అసెంబ్లీకి కేసీఆర్ రావాలని కోరుతున్నామని మంత్రి పొంగులేటి వివరించారు.
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో కొత్తగా 10 అంశాలు చేర్చినట్టు మంత్రి వివరించారు. సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్‌ను తీసివేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 2లక్షల 32 వేల దరఖాస్తులను యాప్ లో నమోదు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఆలస్యం అయిన అసలైన లబ్ధి దారులకు ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గిరిజనులు నివాసం ఉండే ప్రాంతాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్టు మంత్రి తెలిపారు.తెలంగాణ తల్లి విగ్రహం అంశంలో వివాదం చేస్తోన్న బీఆర్‌ఎస్ నాయకులు ఎనాడైనా తమకు సూచనలు చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం పై సమాధానం చెప్పలేకనే అసెంబ్లీ కి రాకుండా బీఆర్‌ఎస్ పారి పోయిందన్నారు.
రైతులకు భేడీలు వేయడం సరి అయింది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారని గుర్తు చేసారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ కి కారణమని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. రెండ్లే నుంచి పెండింగ్ లో ఉన్న హాస్టల్స్ బిల్లులను ఈనెలాఖరులోగా విడుదల చేస్తామని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బిఆర్‌ఎస్‌కు బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ తల్లి, బయ్యారం ఉక్కు కర్మాగారం అంటూ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి అన్నారు.