Sunday, January 12, 2025

సంక్రాంతి తరువాత కేబినెట్ విస్తరణ

- Advertisement -
- Advertisement -

నెలరోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ
త్వరలో మరికొన్ని చేరికలు రెండు,మూడు
రోజుల్లో పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థుల
ప్రకటన మిత్రపక్షాలకే ఉపాధ్యాయ
ఎంఎల్‌సి సీటు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి
అభ్యర్థిత్వం కోసం పరిశీలనలో నలుగురి పేర్లు
దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించాకే
నిర్ణయం : పిసిసి సారథి మహేశ్

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గ వి స్తరణ సంక్రాంతి పండుగ తర్వాత ఉంటుంద ని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచనప్రాయంగా వెల్లడించారు. మిగిలిన నామినేటేడ్ పదవులను నెల రోజులలో భర్తీ చేయబోతున్నామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన, క ష్టపడుతున్న వారికే పదవులు దక్కుతాయని ఆ యన స్పష్టం చేశారు. ఎవరేవరూ ఏమేమి చేశారో, చేస్తున్నారో అందరి చిట్టా అధిష్ఠానం వద్ద ఉందని అన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ శ నివారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చా ట్ చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు, బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. ఈ చేరికలు కూడా సంకాంత్రి తర్వాతనే
ఉంటాయని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని 2, 3 రోజులలో ప్రకటిస్తామని, అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తమ మిత్ర పక్షాలు ప్రకటించే అభ్యర్థికి మద్దతు ఇస్తామని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నలుగురి పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నాయని వారిలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డితో పాటు ప్రసన్న హరికృష్ణ, రిటైర్డు పోలీస్ అధికారి గంగాధర్ పేర్లు పరిశీలలో ఉన్నట్టు వివరించారు. ఈ నెల చివరి నాటికి పార్టీలో అన్ని కమిటీలను నియమిస్తామని తెలిపారు. ఫార్ములా ఈ—రేస్‌కార్ వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, ఆయన వ్యాఖ్యలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ- రేసు కార్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని దానం నాగేందర్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా హైడ్రా వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని దానం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి మీడియా తీసుకెళ్లగా ఆయన పై విధంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News