Wednesday, February 12, 2025

మరో డిప్యూటీ సీఎం?

- Advertisement -
- Advertisement -

బీసీకి ఇవ్వాలని
యోచిస్తున్న అధిష్ఠానం
రేసులో మంత్రులు పొన్నం
ప్రభాకర్, కొండా సురేఖ,
టీపీసీసీ అధినేత
మహేశ్‌కుమార్ బీజేపీ
బీసీ నినాదానికి
విరుగుడుగా వ్యూహం
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ
కలిసి వస్తుందని అంచనా

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణలో మరో డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తోన్నట్టు కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండో డిప్యూటీ సీఎం పదవిని బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టాలని ఆ లోచిస్తున్నట్టుగా తెలిసింది. బీసీ ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడంతో పాటు ఇటీవల బీసీ నినాదం జపిస్తోన్న బీజేపీకి విరుగుడు మంత్రంగా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టుగా సమాచా రం. ఇప్పటికే డిప్యూటీ సిఎంగా ఎస్సీ, మాల సా మాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఉన్నా రు. రాష్ట్ర ముఖ్యనేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు పార్టీ ముఖ్యనేత ఒకరు మంత్రివర్గ విస్తరణలో భా గంగా మరొకరికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇ స్తే ఎలా ఉంటుందని ఆరా తీసినట్టుగా తెలిసింది.

పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ రాష్ట్ర నేతలతో విడివిడిగా సమావేశమైన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన ముఖ్యనేత వద్ద ప్రస్తావించినట్టుగా సమాచా రం. రాష్ట్రంలో త్వర లోగ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపిటిసి, జెడ్పీటిసి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు ఉండటంతో బీసీకి డిప్యూటీ సీఎం ఇవ్వడం ద్వారా పార్టీకి కలిసి వస్తుందని అధిష్టాన పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే దేశంలోనే మొదటగా రాష్ట్రంలో కులగణన చేపట్టి బిసి రిజర్వేషన్‌లను మార్పులు, చేర్పులు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిసి నినాదంతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతున్న ప్రభుత్వానికి, బీసీల్లో మరింత నమ్మకాన్ని కల్పించవచ్చని అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం.

ఏఐసిసి వద్ద ప్రతిపాదనలు
రాష్ట్రం నుంచి మరో డిప్యూటీ సిఎం పదవి ఇవ్వాలని గతంలోనే ఏఐసిసికి రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు ప్రతిపాదన ఇవ్వగా, ఇదే అంశాన్ని అధిష్ఠానం తాజాగా మంత్రివర్గ విస్తరణ సందర్భంగా చర్చకు పెట్టినట్టు తెలిసింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగితే కచ్చితంగా ఇందులో డిప్యూటీ సిఎం పదవి బిసిలకు దక్కే అవకాశం ఉందని ప్రభుత్వంలో కీలకనేతల మధ్య చర్చ జరుగుతోంది.
రేసులో మంత్రులు పొన్నం, కొండాతో పాటు మహేశ్?
రెండో డిప్యూటీ సిఎం పదవి బిసి సామాజిక వర్గానికి కట్టబెడితే అది ఎవరికీ దక్కుతుందన్న దానిపై ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసింది. మంత్రి కొండా సురేఖ 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించగా, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకసారి ఎమ్మెల్యేగా, మరోమారు ఎంపిగా గెలవగా, మహేశ్‌కుమార్‌గౌడ్ ఎమ్మెల్సీగా, టీపీసీసీ అధ్యక్షునిగా, విద్యార్థి దశ నుంచి పార్టీలో చురుకుగా ఉన్నారు.

ఒకవేళ బిసి మహిళకు ఈ పదవి ఇవ్వాలనుకుంటే….
ఒకవేళ బిసి మహిళకు ఈ పదవి ఇవ్వాలనుకుంటే సీనియర్ నాయకురాలైన కొండా సురేఖ ఒక్కరే రేసులో ఉంటారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం బిసి నినాదంపై జోరుగా చర్చ జరుగుతుండడం, రానున్న ఎన్నికల్లో ఈ నినాదంతో అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్ చేయాలని కాంగ్రెస్ వ్యూహాంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉండటంతో ఇంకా మరికొందరు సీనియర్‌ల సలహాలు, సూచనలను కూడా అధిష్ఠాన పెద్దలు తీసుకోవాలని యోచిస్తున్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News