కొందరు మంత్రుల పనితీరుపై అధిష్ఠానం
అసంతృప్తి ఏడుగురు మంత్రులు ఉండి
ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటమా? సిట్టింగ్
సీటు కోల్పోవడం పట్ల సీరియస్ నివేదిక
కోరిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి
మీనాక్షి సమన్వయ లోపం వల్లే ఓడినట్లు
పట్టభద్రుల అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఫిర్యాదు
మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ పై అధిష్ఠానం పునరాలోచనలో పడిన ట్టు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం. వి స్తరణతో పాటు ప్రస్తుత మంత్రివర్గా న్ని ప్రక్షాళన చేసే దిశగా అధిష్ఠానం యోచిస్తున్నట్టు ఈ వర్గా లు చెబుతున్నాయి. కొందరు మంత్రుల పనితీరు పట్ల అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉండటంతో ఆ దిశగా మంత్రివర్గ ప్రక్షాళనకే అధిష్ఠానం మొ గ్గుచూపుతున్నట్టు ఇటీవల అధిష్ఠానాన్ని కలిసి వచ్చిన నేతలకు పరోక్ష సంకేతాలు ఇచ్చినట్టు తె లిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉండికూడా ఇ టీవల ఉత్తర తెలంగాణలో జరిగిన ఉపాధ్యా య, పట్టభద్రుల రెండు ఎమ్మెల్సీ స్థానాలను కో ల్పొవడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకున్న ట్టు తెలిసింది. పైగా ఈ రెండింటిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అధికార కాంగ్రెస్ పార్టీకి (జీవన్‌రెడ్డి) సిట్టింగ్ స్థానం. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానా లు కలిగిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి ముగ్గురు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), దామోదర రాజనరసింహ (మెదక్) నుం చి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆదిలాబాద్ జిల్లా కు సీతక్క, కరీంనగర్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ని జామాబాద్‌కు జూపల్లి కృష్ణారావు, మెదక్‌కు కొండా సురేఖ ఇన్‌చార్జి మంత్రులుగా ఉన్నారు.
మొత్తంగా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఏడుగురు మంత్రులు ఉండికూడా పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎందుకు ఓటమి చెందాల్సి వ చ్చిందని అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. పైగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కూడా ఎమ్మెల్సీ ల ఓటమి చెందిన జిల్లాల పరిధిలోనే ఉండటం తో దీనిపై అధిష్ఠానం మరింత సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటుతో సహా రెండు ఎమ్మెల్సీస్థానాలలో ఓటమికిగల కా రణాలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ను రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నివేదిక కో రినట్టు కూడా ఈ వర్గాల సమాచారం. శాసనస భ ఎన్నికలలో అధికారాన్ని దక్కించుకొని, ఆ వెంటనే వ చ్చిన పార్లమెంట్ ఎన్నికలలో ఆశించిన మేరకు ఎంపీ సీట్లు గెలుచుకోక పోవడం పట్ల ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో మంత్రుల వైఫల్యం అధిష్ఠానానికి మరింత ఆగ్రహం తెప్పించినట్టు ఈ వర్గాల సమాచారం. ఈ అంశం శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన మంత్రిమండలిలో కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులకు మధ్య సమన్వయ లోపమే ఓటమికి కారణమనే అభిప్రాయం ఇందులో వ్యక్తం అయినట్టు తెలిసింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి నరేందర్‌రెడ్డి కూడా మంత్రుల, ఎమ్మెల్యేల సమన్వయ లోపమే తన ఓటమికి కారణమని అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తాను ఇన్‌చార్జి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గాల ఇన్‌చార్జ్జిలలో కొందరు తాను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరని మంత్రి సీతక్క రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ జిల్లా ఇన్‌చార్జిగా తనను తప్పించాలని కూడా ఆమె కోరారు. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలకు, మరోవైపు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు మధ్య సమన్వయ లోపం తదితర కారణాల వల్ల పార్లమెంట్ ఎన్నికలు,ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణమని అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్టు ఈ వర్గాల సమాచారం. ఈ కారణంగానే మంత్రివర్గ ప్రక్షాళన దిశగా అధిష్ఠానం యోచిస్తోన్నట్టు తెలిసింది. మంత్రుల పనితీరు ఇదే విధంగా ఉంటే స్థానిక సంస్థల
ఎన్నికలలోనూ పార్టీకి గడ్డు పరిస్థితేనని అధిష్ఠానం ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. దీంతో మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రస్తుత మంత్రులలో కొందరికి ఉద్వాసన పలికి ఏకంగా మంత్రివర్గ ప్రక్షాళన చేసే దిశగానే అధిష్ఠానం యోచిస్తోన్నట్టు శాసనసభ లాబీలలో ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా చెప్పుకొచ్చారు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్నది అధిష్ఠానమే ఖరారు చేస్తుంది తప్ప రాష్ట్ర నేతల సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటుందని తాను అనుకోవడం లేదని మంత్రి పదవి ఆశిస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మీడియా చిట్ చాటులో పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కూడా అధిష్ఠానమే నిర్ణయించిందని, మంత్రి పదవుల ఖరారు విషయంలో కూడా ఇదే జరుగబోతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం పార్టీ వర్గాల కథనాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.