Sunday, December 22, 2024

సీతక్కకు హోంశాఖ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొ త్తగా ఐదారుగురికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. శాఖల మార్పులకు సైతం అవకాశం ఉందని అన్నారు. కీలకమైన హోం మంత్రి పదవి ప్రస్తుతం మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్కకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఐదారుగురికి కొత్తగా చోటు దక్కనుందని వ్యాఖ్యానించారు.

మంత్రివర్గంలో కుల సమీకరణాల ఆధారంగా ఓ ముదిరాజ్‌కు, రెడ్డికి సైతం స్థానం ఉంటుందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్‌కు చోటు కల్పించే ఆస్కారం ఉందని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మరొకరికి చోటు దక్కనున్నట్టు పేర్కొన్నారు. పార్టీలు మారిన వారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వొద్దనుకున్నప్పటికీ, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బయట నుంచి వచ్చిన వారికి సైతం మంత్రివర్గంలో చోటు దక్కనుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News