Wednesday, March 26, 2025

ఉగాదికి విస్తరణ?

- Advertisement -
- Advertisement -

మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని జిల్లాలవైపు హైకమాండ్ మొగ్గు
నలుగురు లేదా ఐదు కొత్త ముఖాలకు ఛాన్స్
పలువురి పేర్లపై సుదీర్ఘంగా చర్చ బిసి,
మైనారిటీ వర్గాల నుంచి ప్రాతినిథ్యంపైనా
సమాలోచన హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన
ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం
భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కాంగ్రెస్
పెద్దలు ఖర్గే, రాహుల్, కెసి వేణుగోపాల్‌తో భేటీ
కేబినెట్ విస్తరణతోపాటు రాష్ట్రంలో
ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తోన్న ఆశావాహలకు ఉగాదికి ముందే తీపికబురు అందబోతోందా? అంటే, ఢిల్లీలో సోమవారం సాయంత్రం చకచక చోటు చేసుకున్న పరిణామాలు ఆ దిశగానే ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వే స్తున్నాయి. ముఖ్యమైన అంశంపై చర్చించేందుకు వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా అధిష్ఠానం నుంచి పిలుపురాగానే సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుటాహుటిన సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. అంతకుముందే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ లో అందుబాటులో ఉండటంతో వీరంతా ఇందిరాభవన్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహు ల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో 7 గంటల నుంచి 8:30 గంటల వరకు సుదీర్ఘంగా భేటీ అ యి చర్చించారు. రాష్ట్ర నేతలను ఆకస్మాత్తుగా ఢిల్లీకి పిలిపించడానికి కారణం మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కోసమేనని ఈ సమావేశానికి హాజరైన ముఖ్యనేత ఒకరు ఢిల్లీలో మీడియాకు సూచనప్రాయంగా తెలిపారు.

శాసనసభ సమావేశాలు ఈ నెల 27న ముగియనున్నాయి. ఆ మరుసటి రోజు 28న చతుర్ధశి, 29న అమవాస్య ఉండటంతో 30వ తేదిన ఉగాది పర్వదినం రోజున మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఆ రోజు మంత్రివర్గ విస్తరణ జరగని పక్షంలో 31న రంజాన్ (పాండ్యమి), ఏప్రిల్ 1న చవితి (మంగళవారం) కావడంతో ఏప్రిల్ 2 బుధవారం (పంచమి) శుభ తిథి రోజున మంత్రివర్గ విస్తరణకు మంచి ముహుర్తంగా అధిష్ఠానం దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్లినట్టు సమాచారం. అధిష్ఠాన పెద్దలతో రాష్ట్ర నేతలు భేటీ కావడంతో మంత్రిపదవులు దక్కనున్న ఆశావాహుల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని నాలుగు ఉమ్మ డి జిల్లాలకు అధిష్ఠానం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది.వీటిలో ఆదిలాబాద్, నిజామాబాద్,హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఉండగా, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టిగా పట్టుబడుతుండగా, అదే జిల్లాకు చెందిన వివేక్ వెంకటస్వామి తాను కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి గ్యారంటీ అని ధీమాగా ఉన్నట్టు తెలిసింది.

ఇక నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒక్కరి పేరే పరిశీలకు రాగా ఈయన కోసం సీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా పట్టుబట్టినట్టు తెలిసింది. వీరితో పాటు నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు మంత్రి పదవి గ్యారంటీ అని సోమవారం అసెంబ్లీ లాబీలో ధీమా వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్న ట్టు ఇది వరకే సీఎం ప్రకటించిన విషయం తెలిసింది. వీరి తో పాటు మైనార్టీల నుంచి ఎమ్మెల్సీ అమెర్ అలీఖాన్‌తో పాటు ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. అధిష్ఠానంతో జరిగిన భేటీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవులు, ఇంటిగ్రేటెడ్ స్కూ ల్స్, విద్యా, వైద్యం గురించి చర్చించినట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలపై పార్టీ పెద్దలు అడిగి తెలసుకున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News