Wednesday, March 26, 2025

విస్తరణలో మా మాటేమిటి?

- Advertisement -
- Advertisement -

అధిష్ఠానానికి ఆరుగురు మాదిగ ఎంఎల్‌ఎల
లేఖ ఇప్పటికే మాలల నుంచి భట్టి, గడ్డం
ప్రసాద్‌కు పదవులు మాదిగల నుంచి
కేవలం దామోదర రాజనరసింహకే మంత్రి
పదవి కేబినెట్‌లో మాదిగల ప్రాతినిధ్యం
పెంచాలని వినతి తాజా పరిణామాలతో
వివేక్ వెంకటస్వామికి సన్నగిల్లుతున్న
అవకాశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణలో మాజీ ఎంపి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దాదాపు ఖాయం అనుకుంటున్న తరుణంలో మంగళవారం ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. మాల, మాదిగ సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికి మం త్రి పదవి దక్క డం అనుమానమేనని పా ర్టీలో ఉన్నతస్థాయి వ ర్గాలు అంటున్నా యి. మాల సామాజిక వర్గానికి ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవులు ఉండటం తో తిరిగి అదే సామాజిక వర్గానికి చెం దిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పద వి ఎలా ఇస్తారని మాదిగ సామాజిక వ ర్గానికి చెందిన ఎంఎల్‌ఎలు తిరకాసు పెట్టడంతో అధిష్ఠానం పునరాలోచనలో పడినట్టు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల స మాచారం. ఇస్పటికే ప్రభుత్వంలో మాల సామాజికవర్గం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక పదవులు నిర్వహస్తున్నారు.

మాదిగ సామాజికవర్గం నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ ఒక్కరికి మాత్ర మే పదవి లభించింది.దీంతో రాష్ట్రంలో మాదిగ జనాభాకు తగినట్లుగా ప్రభుత్వంలో ప్రాతిని ధ్యం లభించలేదని ఆ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా త మకు అన్యాయం జరుగుతుందని మాదిగ సా మాజికవర్గం నేతలు ఢిల్లీ స్థాయిలో ఆందోళన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో కూడా తిరిగి అదే మాల సామాజిక వర్గాని కి చెందిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఎలా ఇస్తారని మాదిగ సామాజికవర్గానికి చెంది న కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు అధిష్ఠానాన్ని నిలదీస్తున్నట్లు సమాచారం. అత్యవసరంగా హైదరాబాద్‌లో మంగళవారం మాదిగ సామాజికవర్గానికి చెందిన ఆరుగురు ఎంఎల్‌ఎలలో (అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ,వేముల వీరేశం, మందుల సామ్యేల్, కాలే యాదయ్య,తోట లక్ష్మీకాంతరావు) కొందరు సమావేశమైనట్లు తెలిసింది. హాజరు కాని వారు ఫోన్ ద్వారా తమ సంఘీభావం తెలిపినట్లు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో వివేక్ వెంకటస్వామికి బదులుగా తమ సామాజికవర్గానికి ఇ

వ్వాలని కోరుతూ లిఖితపూర్వకంగా అధిష్ఠానానికి లేఖ పంపించినట్లు తెలిసింది. మరోవైపు అధిష్ఠానం కూడా వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కట్టబెట్టడానికి అంత సుముఖంగా లేనట్లుగా తెలిసింది. కాగా, దివంగత నేత జి.వెంకటస్వామి కుటుంబం నుంచి ఆయన ఇద్దరు కుమారులు వినోద్, వివేక్ ఎంఎల్‌లుగా ఉండగా, వివేక్ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయన సోదరుడు ఎంపీ మల్లు రవితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో అన్ని పదవులు ఒకే సామాజికవర్గానికి ఇస్తే తమ పరిస్థితి ఏంటని మాదిగ ఎంఎల్‌ఎలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో అధిష్టానం కూడా వివేక్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్లు ఢిల్లీ నుంచి ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వివేక్‌కు మంత్రి పదవి కాకుండా చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే దిశగా అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలిసింది.

వివేక్‌ను మంత్రి పదవి రేసు నుంచి తప్పించే పక్షంలో మాదిగ సామాజికవర్గం నుంచి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దిశగా అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రముఖంగా విప్ అడ్లూరి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేత కరీంనగర్ జిల్లా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అడ్లూరికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో రాష్ట్ర కీలక నేతలుగా సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News