Sunday, January 19, 2025

హైడ్రాకు సూపర్ పవర్స్

- Advertisement -
- Advertisement -

హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. శుక్రవారం సిఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ సుమారు మూడు గంటల పాటు జరిగిం ది. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ నిర్ణ యం తీసుకున్నారు. అందులో భాగంగా ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లో నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా కు అధికారాలు కల్పించారు. ఓఆర్‌ఆర్‌కు లోపల ఉన్న చెరువులు, నాలాలు కబ్జాల కట్టడికి హైడ్రాకు అధికారాలు కల్పించారు. హైడ్రాకు 169 మంది అధికారులను, 946 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించేలా ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని రెండు యూనివర్శిటీలతో పాటు హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేర్ల మార్పునకు కేబినెట్ ఆ మోదం తెలిపింది. చాకలి ఐలమ్మ పేరును ఉమెన్స్ కా లేజీకి, సురవరం ప్రతాప్ రెడ్డి పేరును తెలుగు యూనివర్శిటీకి, హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బా పూజీ పేరును పెడుతూ కేబినెట్ నిర్ణయించింది.

అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించడంతో పాటు 34మంది సిబ్బంది తో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ఖరారు చే సేందుకు 12మందితో కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉం టారని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పోలీ సు ఆరోగ్య భద్రత స్కీమ్ ఎస్‌పిఎల్‌కు కూడా వర్తించేయాలని నిర్ణయించారు. ఇక మనోహర్‌బాద్‌లో 72 ఎ కరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ఆమోదించగా, 8 వైద్య కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియమించాలని మంత్రివర్గం ఆమోదించింది. 3వేలకు పై గా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని, ఇక ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కోస్గీలో ఇంజనీరింగ్ కళాశాల, హకీంపేట లో జూనియర్ కళాశాల మంజూరుతో పాటు ఈ ఖరీఫ్ నుంచి ఎంఎస్‌పికి అదనంగా రూ.500లు చెల్లించి స న్నాలు కొనుగోలు చేయాలని నిర్ణయయించారు. ఇక అక్టోబర్ నుంచి తెల్లరేషన్ కార్టుల జారీ చేయడంతో పాటు జనవరి నుంచి అన్ని రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు.

హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించాం: మంత్రి పొంగులేటి
ఈ మేరకు మంత్రివర్గంలో ఆమోదించిన పలు అంశాల గురించి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ హైడ్రాకు చట్టబద్ధత కల్పించే విషయంపై నిర్ణయం తీసుకున్నామన్నారు. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో కట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తుందని మంత్రి తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలు, 51 గ్రామ పంచాయితీలు హైడ్రా పరిధిలో ఉన్నాయని, అందులో భాగంగానే హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, హైడ్రా కోసం 169 మంది అధికారులను 946 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కేటాయిస్తూ నిర్ణయించామని ఆయన తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు 12 మంది ఉన్నతాధికారులతో కమిటీ వేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక వీటితో పాటు ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరును, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరుకు బదులుగా సురవరం ప్రతాప్ రెడ్డి పేరును, కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా పేర్లను మార్చుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు

టన్నెల్ పనులు రెండేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌కుమార్
ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనులకు రూ. 4,637 కోట్ల రివైజ్డ్ ఎస్టీమేషన్ ఇచ్చామని, ఈ పనులను రెండేళ్లలో (సెప్టెంబర్ 2027లోగా) ఈ పనులను పూర్తిచేస్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ చారిత్రాత్మకం కానుందని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా వాటర్ తీసుకునే అవకాశం ఉందన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండింగ్ పనులను తొందరగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ప్రతినెలా 400 మీటర్లు టన్నెల్ పనులను పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి నుంచి ప్రతి రోజు 4వేల క్యూసెక్కులు, సంవత్సరానికి 30 టిఎంసీల నీళ్లు 4 లక్షల ఎకరాలకు అందుతాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బిసి పనులు తాను ఇరిగేషన్ మంత్రిగా ఉండగా పూర్తి కావడం ఎంతో ఆత్మ సంతృప్తినిస్తుందన్నారు. కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు నీళ్లు రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. కానీ, ఎస్‌ఎల్‌బిసి పనులకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 40 కిలోమీటర్ల పనుల్లో ఇంకా 9 కిలోమీటర్లు సొరంగం పూర్తి చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

ఎస్‌ఎల్‌బిసితో నల్గొండ జిల్లాలో పూర్తిగా ఫ్లోరైడ్ దూరం: మంత్రి కోమటిరెడ్డి
ఎస్‌ఎల్‌బిసిపై గతంలో కెసిఆర్ వ్యంగంగా మాట్లాడారని, దానిని నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం తమ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో రెండు పంటలకు కాలువ ద్వారా ఎస్‌ఎల్‌బిసికి నీళ్లు వస్తాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని కెసిఆర్ ఎస్‌ఎల్‌బిసి పూర్తిచేయలేదని, ఎస్‌ఎల్‌బిసితో నల్గొండ జిల్లా పూర్తిగా ఫ్లోరైడ్ దూరం అవుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలిపిందని, జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని కోమటిరెడ్డి తెలిపారు. గతంలోనే మేనిఫెస్టోలో ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేసి పొలాలకు నీళ్లు ఇస్తామన్నారు. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు. 24 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా కంపెనీ ప్రతినిధులతో మంత్రులు చర్చించామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేలా తనను అమెరికా పంపి సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించేలా చేశారన్నారు. మిషన్ భగీరథలో నల్గొండ జిల్లాలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News