Wednesday, July 3, 2024

రుణమాఫీకి గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది నెలల్లోనే రూ.2లక్షల రుణమాఫీని అమలు చేస్తున్నామని, ఒకే విడతలో ఈ మొత్తాన్ని మాఫీ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రం లో రైతు రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్ సిఎం రే వంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటీ అ య్యింది. ఈ సమావేశంలో రుణమాఫీపై ప్ర భుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణమాఫీపై తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ శుక్రవారం సా యంత్రం ప్రకటించారు. ఈ సందర్భంగా సి ఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేబినెట్ భేటీలో పంట రుణమా ఫీ విధి, విధానాలపై చర్చించామని ఆయన తెలిపారు. వ్యవసాయాన్ని పండుగ చేయడం కాంగ్రెస్ పార్టీ విధానమని, కాంగ్రెస్ మాట ఇస్తే వెనకడుగు వేయదని, పార్టీకి నష్టమని తెలిసినా సోనియా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, సోనియా గాంధీ మాట ఇస్తే శిలాశాసనమేనని సిఎం రేవంత్ పేర్కొన్నారు. సో నియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలు మాట ఇస్తే తప్పరని ఆయన అన్నారు.

ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం రేవంత్ అన్నారు. వ్య వసాయం దండుగ కాదు, పండుగ అనుకునే విధంగా సాగు రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 2022 మే 6వ తేదీన జరిగిన వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారని, ఆయన ఇచ్చిన హామీ ని అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. గ త ప్రభుత్వం 2014, 2018లో రుణమాఫీ చేసిందని, రెండు సార్లు ఆ ప్రభుత్వం మొత్తం రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసిందని సి ఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వం 11డిసెంబర్ 2018 వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసిందని, తమ ప్రభుత్వం 12డిసెంబర్ 2018 నుంచి 9డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించిందని సిఎం రే వంత్ పేర్కొన్నారు.

రుణమాఫీకి దాదాపు రూ.31వేల కోట్లు అవసరమవుతుందని ఆ యన తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్ర భుత్వం రుణమాఫీ చేయాలని తమ ప్రభు త్వం నిర్ణయించిందని సిఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, తమ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

రైతు భరోసా అమలుకు మంత్రివర్గ ఉపసంఘం
రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయని, రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారన్న చర్చ జరుగుతోందని, అందులో భాగంగానే రైతు భరోసాను పారదర్శకంగా అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించామని సిఎం రేవంత్ తెలిపారు. రైతుభరోసాను పారదర్శకంగా నిస్సహాయులకు సాయం అందిస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా ఉంటారని సిఎం తెలిపారు. రైతు భరోసా విధి, విధానాలను ఖరారు చేయడానికి రాజకీయ పార్టీలు, రైతు సంఘాలను ఇందులో భాగస్వాములను చేస్తామని ఆయన పేర్కొన్నారు. జూలై 15వ తేదీలోపు ఉప సంఘం నివేదిక అందిస్తుందన్నారు. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసాను అమలు చేస్తామని సిఎం రేవంత్ తెలిపారు. ఆ నియమ, నిబంధనల మేరకు రైతు భరోసాను అమలు చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

వారిద్దరూ ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం…
మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు తీసుకుంటారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. వారిద్దరూ ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారమని సిఎం తెలిపారు. ఏదైనా సమాచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలని సిఎం సూచించారు. రుణమాఫీపై తినబోతూ రుచులెందుకని, రైతు రుణమాఫీ చేసి తీరుతామని, దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదని, నియమ నిబంధనలకు సంబంధించి జీఓలో అన్నీ పొందుపరుస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. చివరగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం పక్షాన మాట నిలబెట్టుకున్నందుకు సిఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News