Wednesday, January 22, 2025

నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు(శనివారం) తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 4గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం తెలపడం, గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపు, ఇందిరమ్మ కమిటీలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, అసెంబ్లీ సమావేశాలు, ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. వారికి 2 DAలు ఇవ్వడంపై ప్రకటన చేసే ఛాన్సుంది. జీవో 317పై సర్కార్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News