- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టం ఆర్వోఆర్ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరికి మించి పిల్లలున్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీ రాజ్ చట్టసవరణ చేయనున్నట్లు సమాచారం. అలాగే రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ బిల్లులను అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చి చర్చించనున్నారు.
- Advertisement -