Monday, December 23, 2024

కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతుబంధు నిధుల విడుదల, ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం, పోడు భూములు సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ జరుగుతోంది. శాసనసభ సమావేశాలు, రాష్ట్ర ఆర్థిక స్థితగతులు, కేంద్రం ఆంక్షలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీఆర్‌ఎస్‌ లక్ష్యాలు, కార్యాచరణ సహా ఇతర అంశాలు చర్చకు రావచ్చని సమాచారం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ ఆంక్షలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధుల సమీకరణ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మంజూరు అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పోడు భూముల అంశంపై కసరత్తును కేబినెట్ సమీక్షించనుంది. సర్వే, గ్రామ సభలు పూర్తయిన తరుణంలో క్షేత్రస్థాయి స్థితిగతులు, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.

డీఎఫ్‌వో శ్రీనివాస్ రావు హత్య నేపథ్యంలో అటవీ అధికారులు, సిబ్బందికి రక్షణా చర్యల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీఆర్ఏలకు వేతన స్కేల్ అంశంపై చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రహదార్లు-భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పునర్‌ వ్యవస్థీకరణపై చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లపైనా సమీక్షించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News