- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం శనివారం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కేబినెట్ భేటీకి రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సెప్టెంబర్ 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు, పాలనాపరమైన అంశాలు, తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణ, విద్యుత్ బకాయిలు, ఇతర అంశాల్లో కేంద్రం వైఖరి, పోడు భూములు, ప్రభుత్వ ఉద్యోగులకు డిఎపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం, సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా నిర్ణయం తీసుకునే అవకాశముంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
- Advertisement -