Wednesday, December 18, 2024

కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

Telangana Cabinet meeting continue

హైదరాబాద్: ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా ఉద్యోగాల భర్తీ అంశంపై సమావేశంలో చర్చజరుగుతున్నట్టు తెలుస్తోంది. 50వేల ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై కేబినెట్ కు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు నివేదికలు సమర్పించాయి. నెలలోపు వైకుంఠధామాలు పూర్తిచేయాలని మంత్రులను సిఎం ఆదేశించారు. అన్నిగ్రామాల్లో వీధి దీపాలను ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించా. హైదరాబాద్ శివారు పురపాలికల్లో నీటి సమస్యలపై కూడా మంత్రివర్గ సమావేశంలో  చర్చిస్తున్నారు. పురపాలికల్లో నీటి సమస్య తీర్చేందుకు తక్షణమే అదనంగా రూ.1200 కోట్లును సిఎం మంజూరు చేశారు. నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

Telangana Cabinet meeting continue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News